రజినీకాంత్.. మాస్ జాతర మొదలెట్టాడు

Rajinikanth's swag skyrockets in Nelson Dilipkumar's film. సూపర్ స్టార్ రజినీకాంత్, డైరెక్టర్ నెల్సన్ కుమార్ కాంబోలో వస్తున్న సినిమా జైలర్.

By Medi Samrat  Published on  2 Aug 2023 9:00 PM IST
రజినీకాంత్.. మాస్ జాతర మొదలెట్టాడు

సూపర్ స్టార్ రజినీకాంత్, డైరెక్టర్ నెల్సన్ కుమార్ కాంబోలో వస్తున్న సినిమా జైలర్. ఈ మూవీ నుంచి ట్రైలర్ అదిరిపోయింది. నెల్సన్ మార్క్ కామెడీతోనూ.. సూపర్ యాక్షన్స్ తోనూ ట్రైలర్ ను నింపేశారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ కూడా గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. సునీల్ ట్రైలర్ లో కనిపించి తెలుగు అభిమానులను ఖుషీ చేశాడు. ఆగస్టు 10న రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈ సినిమాపై సూపర్ స్టార్ అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్, మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్‌ మోహన్ లాల్, నాగబాబు, జాకీ ష్రాఫ్, రమ్య కృష్ణ లు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాకి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించారు.

‘జైలర్’ ట్రైలర్‌లో రజినీకాంత్ అద్భుతంగా కనిపిస్తున్నారు. వెండితెరపై రజినీకాంత్ విలక్షణ నటన కనపడనుంది. ఆకట్టుకునే విజువల్స్, ఆసక్తికరమైన కథాంశంతో ఈ చిత్రం ఉండనుంది. అద్భుతమైన సినిమాటోగ్రఫీతో పాటుగా చిత్రనిర్మాతలు ఖర్చుకు ఏ మాత్రం వెనుకాడలేదని స్పష్టంగా అర్థమవుతోంది. సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించిన జైలర్‌కి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. సినిమాటోగ్రాఫర్ గా విజయ్ కార్తీక్ కన్నన్, ఎడిటర్ గా ఆర్ నిర్మల్ పని చేస్తున్నారు.

Next Story