రజనీ కూలీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. పోటీ ఎవరితో అంటే?

సూప‌ర్ స్టార్ రజినీకాంత్, ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు లోకేశ్‌ కనకరాజ్ కాంబినేష‌న్ లో తెర‌కెక్కుతున్న చిత్రం కూలీ.

By Medi Samrat
Published on : 4 April 2025 9:19 PM IST

రజనీ కూలీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. పోటీ ఎవరితో అంటే?

సూప‌ర్ స్టార్ రజినీకాంత్, ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు లోకేశ్‌ కనకరాజ్ కాంబినేష‌న్ లో తెర‌కెక్కుతున్న చిత్రం కూలీ. భారీ అంచ‌నాలు ఉన్న ఈ మూవీ విడుద‌ల తేదీని తాజాగా మేక‌ర్స్ ఖ‌రారు చేశారు. ఆగ‌స్టు 14న సినిమాను ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ చిత్రంలో అక్కినేని నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్ వంటి సూపర్ స్టార్స్ కూడా అతిథి పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు.

ఆగస్టు 14న ఎన్టీఆర్ నటించిన బాలీవుడ్ మూవీ వార్ 2 కూడా రాబోతుంది. ఇందులో హృతిక్ రోషన్ మరో హీరోగా నటించాడు. ఈ రెండు సినిమాలకు మంచి పోటీ ఉండనుంది. ఇంకా విడుదలకు కాస్త సమయం ఉండడంతో రిలీజ్ డేట్స్ లో మార్పులు జరిగే అవకాశం కూడా లేకపోలేదు.

Next Story