మీనా కుటుంబాన్ని పరామర్శించిన రజినీకాంత్

Rajinikanth pays homage to Meena's late husband Vidyasagar at her residence. సినీ నటి మీనా భర్త విద్యాసాగర్ నిన్న రాత్రి హఠాన్మరణం చెందారు.

By Medi Samrat  Published on  29 Jun 2022 9:07 PM IST
మీనా కుటుంబాన్ని పరామర్శించిన రజినీకాంత్

సినీ నటి మీనా భర్త విద్యాసాగర్ నిన్న రాత్రి హఠాన్మరణం చెందారు. శ్వాసకోశ సమస్యలతో ఆయన మృతి చెందినట్టు వైద్యులు వెల్లడించారు. అయితే పావురాల వల్లే ఆయన చనిపోయారంటూ తమిళ పత్రికల్లో వార్తలు వస్తున్నాయి. పావురాల వ్యర్థాల నుంచి వచ్చే గాలిని ఎక్కువగా పీల్చడం వల్లే ఆయన తీవ్ర అనారోగ్యానికి గురై మరణించారని అంటున్నారు. మీనా కుటుంబం ఉంటున్న ప్రాంతంలో పావురాలు ఎక్కువగా ఉంటాయి. వాటి వ్యర్థాల నుంచి వచ్చే గాలిని పీల్చడం వల్ల ఆయనకు ఊపిరితిత్తుల సమస్య ప్రారంభమయిందని చెప్పుకొచ్చారు. ఈ ఏడాది ప్రారంభంలో ఆయనకు కరోనా సోకడంతో ఊపిరితిత్తుల సమస్య మరింత ఎక్కువయింది. ఊపిరితిత్తుల మార్పిడి చేయించాలని వైద్యులు సూచించినప్పటికీ దాతలు దొరకలేదు. దీంతో చివరకు ఆయన మృతి చెందారు.

మీనా కుటుంబానికి ఆ దేవుడు మ‌నోధైర్యాన్ని ప్ర‌సాదించాలంటూ ప‌లువురు సినీ సెల‌బ్రిటీలు, అభిమానులు, నెటిజ‌న్స్ సోష‌ల్ మీడియా ద్వారా సంతాపాన్ని వ్య‌క్తం చేశారు. పలువురు సెల‌బ్రిటీలు నేరుగా మీనా ఇంటికి వెళ్లి ప‌రామర్శించారు. సూపర్ స్టార్ ర‌జినీకాంత్ మీనా ఇంట‌కి వెళ్లారు. విద్యాసాగ‌ర్ పార్థివ దేహానికి నివాళులు అర్పించిన ఆయ‌న మీనా, ఆమెకు కుటుంబ స‌భ్యుల‌ను ప‌రామ‌ర్శించారు. మీనా య‌జ‌మాన్‌, వీరా, ముత్తు చిత్రాల్లో హీరోయిన్ గా రజినీతో క‌లిసి న‌టించింది. కుచేల‌న్‌, అన్నాత్తే (పెద్ద‌న్న) సినిమాలో ముఖ్య పాత్రలో న‌టించింది.










Next Story