రజనీకాంత్ హెల్త్ బులెటిన్ విడుద‌ల‌

సోమవారం రాత్రి చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన తమిళ సూప‌ర్‌స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నారని ఆసుపత్రి విడుదల చేసిన హెల్త్ బులెటిన్ పేర్కొంది

By Medi Samrat  Published on  1 Oct 2024 8:45 PM IST
రజనీకాంత్ హెల్త్ బులెటిన్ విడుద‌ల‌

సోమవారం రాత్రి చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన తమిళ సూప‌ర్‌స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నారని ఆసుపత్రి విడుదల చేసిన హెల్త్ బులెటిన్ పేర్కొంది. సూప‌ర్‌స్టార్‌కు గుండెకు సంబంధించిన చికిత్స విజయవంతంగా జరిగిందని ఆసుపత్రి ఓ ప్రకటనలో తెలిపింది. గురువారం నాటికి డిశ్చార్జి అవుతారని కూడా తెలిపింది.

రజినీకాంత్ 30 సెప్టెంబర్ 2024న గ్రీమ్స్ రోడ్‌లోని అపోలో హాస్పిటల్‌లో చేరారు. ఆయ‌న‌ గుండె (బృహద్ధమని) నుండి బయటకు వచ్చే ప్రధాన రక్తనాళంలో వాపు వచ్చింది, దీనికి నాన్‌సర్జికల్ ట్రాన్స్‌కాథెటర్ పద్ధతి ద్వారా చికిత్స అందించబడింది" అని ఆసుపత్రి ప్రకటనలో పేర్కొంది. సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ సాయి సతీష్ బృహద్ధమనిలో ఒక స్టెంట్ ఉంచారు, వాపు (ఎండోవాస్కులర్ రిపేర్) ను పూర్తిగా మూసివేశారు. ప్రణాళికాబద్ధంగా ప్రక్రియ సాగిందని ఆయన శ్రేయోభిలాషులు, అభిమానులకు తెలియజేయాలనుకుంటున్నాము. రజనీకాంత్ ఆరోగ్యం ప్ర‌స్తుతం స్థిరంగా ఉంది. ఆయ‌న‌ బాగానే ఉన్నారు. రెండు రోజుల్లో ఇంటికి చేరుకుంటార‌ని ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు.




Next Story