రజనీకాంత్ 'వెట్టయాన్' పరిస్థితి ఏంటి.?
రజనీకాంత్ నటించిన వెట్టయాన్ ఇటీవల విడుదలై బాక్సాఫీస్ వద్ద యావరేజ్ రెస్పాన్స్ దక్కించుకుంది
By Medi Samrat Published on 16 Oct 2024 9:15 PM ISTరజనీకాంత్ నటించిన వెట్టయాన్ ఇటీవల విడుదలై బాక్సాఫీస్ వద్ద యావరేజ్ రెస్పాన్స్ దక్కించుకుంది. వెట్టయన్ అధికారికంగా బాక్సాఫీస్ వద్ద 200 కోట్ల మార్కును చేరుకుంది. మొదటి వారాంతంలో 185 కోట్లకు పైగా గ్రాస్‌ను సాధించింది, అయితే ఇటీవల పెద్ద డ్రాప్‌ను చూసింది.
ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ విలువ 325 కోట్లు. పేలవమైన బజ్, ప్రమోషన్ల కారణంగా తెలుగు వెర్షన్ కూడా పెద్దగా కలెక్షన్స్ సాధించలేదు. వెట్టయన్ తెలుగు వెర్షన్ ఇప్పటి వరకు దాదాపు 16 కోట్ల గ్రాస్ సాధించింది. కేరళలో దాదాపు 14 కోట్ల గ్రాస్ మాత్రమే దక్కింది. తమిళనాట తొలిరోజు వసూళ్లు 150 కోట్లు వస్తాయని భావించినా అది కుదరలేదు. ఓవర్సీస్‌లో వారాంతానికి 65 కోట్ల గ్రాస్ మాత్రమే రాబట్టింది. ఇక చెన్నై, తమిళనాడులో భారీ వర్షాలు కూడా రజనీ సినిమా కలెక్షన్స్ పై ప్రభావం చూపనున్నాయి.
ఇక తెలంగాణలో ఈ సినిమా టికెట్ రేట్లను తగ్గించారు. మల్టీ ప్లెక్సుల్లో రూ.200, సిటీ సింగిల్ స్క్రీన్‌లలో రూ.150, డిస్ట్రిక్ట్ సింగిల్ థియేటర్లలో రూ.110గా టికెట్ రేట్లను ఫిక్స్ చేశారు. ఈ రేట్లు అక్టోబర్ 18 నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్, మంజు వారియర్, ఫహాద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, రితికా సింగ్, దుషారా విజయన్ కీలక పాత్రలు చేశారు. అనిరుధ్ అందించిన సంగీతం బాగుంది.