డ్యాన్స్ తో దుమ్ము దులిపిన రాజమౌళి దంప‌తులు

ఫ్యామిలీ ఈవెంట్‌లో ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, ఆయన భార్య రమా రాజమౌళి మంచి నృత్య ప్రదర్శన ఇచ్చారు.

By Medi Samrat  Published on  1 April 2024 6:18 AM GMT
డ్యాన్స్ తో దుమ్ము దులిపిన రాజమౌళి దంప‌తులు

ఫ్యామిలీ ఈవెంట్‌లో ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, ఆయన భార్య రమా రాజమౌళి మంచి నృత్య ప్రదర్శన ఇచ్చారు. ఏఆర్ రెహమాన్ చార్ట్ బస్టర్ 'అందమైన ప్రేమ రాణి'కి వీరిద్దరూ డ్యాన్స్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. రాజమౌళి పాటకు తగ్గట్టుగా డ్యాన్స్ చేస్తూ రమా రాజమౌళి చేతులను పట్టుకుని కనిపించడం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. రాజ‌మౌళి, ర‌మ‌ స్టేజ్‌పై ఎంతో హుషారుగా డ్యాన్స్ చేశారు. రాజ‌మౌళి, ర‌మ‌ డాన్స్ చేస్తుంటే.. అందరూ ఈలలు, కేకలు వేశారు.గతంలో SS రాజమౌళి భార్య రమాతో కలిసి.. అతని కుమారుడు SS కార్తికేయ వివాహ వేడుకలో డ్యాన్స్ చేశారు. 'RRR' ఆస్కార్ సాధించిన తర్వాత, దర్శకుడు అనిల్ రావిపూడితో కలిసి 'నాటు నాటు' హుక్ స్టెప్‌ను రీక్రియేట్ చేశారు.

వర్క్ పరంగా.. SS రాజమౌళి ప్రస్తుతం తన రాబోయే చిత్రం ప్రీ-ప్రొడక్షన్ పనిలో ఉన్నారు. ఈ సినిమాకు తాత్కాలికంగా 'SSMB 29' అని పేరు పెట్టారు. గ్లోబ్ ట్రాటింగ్ అడ్వెంచర్‌గా చెబుతున్న ఈ చిత్రం రాబోయే నెలల్లో సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది.


Next Story