వ్యక్తిగతంగానే స్పందిస్తున్నా: రాజ్ నిడిమోరు మాజీ భార్య
ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరు, నటి సమంత వివాహం జరిగింది.
By - Medi Samrat |
ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరు, నటి సమంత వివాహం జరిగింది. రాజ్ మాజీ భార్య శ్యామలీ దే చేసిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయని ఆమె వాపోయారు. మానసిక ఒత్తిడి, భావోద్వేగ క్షోభను ఆమె సోషల్ మీడియాలో పంచుకున్నారు. "కష్ట సమయాల్లో నాకు అండగా ఉన్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను. నాపై ప్రేమ చూపిస్తున్న వారికి స్పందించనందుకు క్షమించండి" అని తెలిపారు. తనకు పీఆర్ టీం గానీ, సోషల్ మీడియాను నిర్వహించేవారు గానీ లేరని, తన జీవితంలోని మార్పులపై వ్యక్తిగతంగానే స్పందిస్తున్నానని ఆమె స్పష్టం చేశారు. ఈ పోస్ట్ సానుభూతి కోసం కాదని, కేవలం తన హృదయంలోని భావాలను పంచుకోవడానికేనని వివరించారు.
డిసెంబర్ 1న, సమంత రూత్ ప్రభు, రాజ్ నిడిమోరు కోయంబత్తూరులోని ఇషా యోగా సెంటర్‌లో వివాహం చేసుకున్నారు. వారి వివాహ ఫోటోలు పబ్లిక్‌గా విడుదలైన వెంటనే పలువురు అభినందనలు తెలిపారు. రాజ్ మాజీ భార్య శ్యామలి దే ఈ వార్తలపై ఎలా స్పందించారో తెలుసుకోవడంపై ఆసక్తిని కనబరిచారు. సమంత, రాజ్ వివాహం జరిగిన కొన్ని రోజుల తర్వాత, శ్యామలి దే సోషల్ మీడియాలో చాలా విషయాలను పంచుకున్నారు.