శిల్పాశెట్టి, రాజ్ కుంద్రా ఫోటోలు వైరల్.. బెయిల్‌పై రిలీజ్ అయ్యాక ఇదే తొలిసారి బయటకు రావడం
Raj Kundra makes first public appearance with wife Shilpa Shetty. అశ్లీల చిత్రాల కేసులో అరెస్టై బెయిల్‌పై బయటకు వచ్చిన రాజ్ కుంద్రా తన సతీమణి
By Medi Samrat Published on 9 Nov 2021 11:19 AM GMT
అశ్లీల చిత్రాల కేసులో అరెస్టై బెయిల్‌పై బయటకు వచ్చిన రాజ్ కుంద్రా తన సతీమణి, బాలీవుడ్ నటి శిల్పాశెట్టితో కలిసి ధర్మశాల వచ్చిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాజ్ కుంద్రా జైలు నుండి విడుదలయ్యాక ఈ జంట మొదటిసారి బహిరంగంగా కనిపించింది. ముదురు పసుపు రంగు దుస్తులు ధరించి, ఒకరి చేతులు మరొకరు పట్టుకుని ఆలయం నుండి బయటకు వస్తున్న ఈ జంట ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. సెప్టెంబరులో బెయిల్ పొందిన తర్వాత రాజ్ కుంద్రా 'లో ప్రొఫైల్' మెయింటెయిన్ చేస్తున్నాడు. నవంబర్ 1న రాజ్ కుంద్రా తన సోషల్ మీడియా హ్యాండిల్స్‌ను కూడా తొలగించాడు.
ఇదిలావుంటే.. రాజ్ కుంద్రా అడల్ట్ వీడియోలను రూపొందించడం, ప్రసారం చేస్తున్నాడనే ఆరోపణలతో ముంబై పోలీసులు జూలై 19న అతనిని అరెస్టు చేశారు. కుంద్రా అరెస్టు అతని కుటుంబంతో పాటు మొత్తం బాలీవుడ్‌కే షాక్ ను ఇచ్చింది. దాదాపు రెండు నెలల తర్వాత సెప్టెంబర్ 20న ముంబై కోర్టు రాజ్ కుంద్రాకి బెయిల్ మంజూరు చేసింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం సహా ఇండియన్ పీనల్ కోడ్‌లోని పలు సెక్షన్ల కింద అతనిపై కేసులు నమోదవ్వడం సంచలనం సృష్టించాయి. దీంతో రాజ్ కుంద్రా మొదటి విహారయాత్ర ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదిలావుంటే.. శిల్పాశెట్టి కూడా పెద్దగా బయట కనపడకపోగా.. చివరిసారిగా డ్యాన్స్ రియాలిటీ షో సూపర్ డాన్సర్ 4కి న్యాయనిర్ణేతగా కనిపించారు.