తాను తీస్తోంది అశ్లీల చిత్రాలు కావని అంటున్న రాజ్ కుంద్రా
Raj Kundra case live updates. బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రాను పోలీసులు అరెస్టు చేశారు. అశ్లీల చిత్రాలను నిర్మించి
By Medi Samrat Published on 22 July 2021 7:21 PM ISTబాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రాను పోలీసులు అరెస్టు చేశారు. అశ్లీల చిత్రాలను నిర్మించి యాప్‌ల ద్వారా విడుదల చేస్తున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యాపారవేత్త రాజ్‌కుంద్రాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఆరోపణలపై ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు ఫిబ్రవరిలోనే కేసు నమోదు చేశారు. ఈ కేసులో రాజ్‌కుంద్రానే ప్రధాన కుట్రదారుడిగా ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి ఆధారాలు తమ వద్ద ఉన్నాయని పోలీసులు తెలిపారు. ముంబై పోలీస్ కమిషనర్ హేమంత్ నాగ్రాలే రాజ్ కుంద్రా అరెస్టును సోమవారం నాడు ధృవీకరించారు. "అశ్లీల చిత్రాల సృష్టి మరియు కొన్ని యాప్స్ ద్వారా విడుదల చేయడం విషయంలో ఫిబ్రవరి 2021 లో ముంబైలో క్రైమ్ బ్రాంచ్ కేసు నమోదు చేసింది. ఈ కేసులో మిస్టర్ రాజ్ కుంద్రాను 19/7/21 న అరెస్టు చేశామని తెలిపారు.
ఈ కేసులో రాజ్‌కుంద్రా లాయర్ కోర్టులో తన వాదనలు వినిపించారు. లాయర్ అబద్ పోండా కోర్టులో వాదిస్తూ.. ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్‌లోని 67ఏ సెక్షన్ ను రాజ్‌కుంద్రాపై మోపడం సరైంది కాదన్నారు. ఈ చట్టం ప్రకారం నిజమైన శృంగార సంభోగమే పోర్న్ అని, మిగితా అంతా వేరే కాంటెంట్‌గా పరిగణిస్తారని లాయర్ తెలిపారు. ఐటీ చట్టాలను.. ఐపీసీ సెక్షన్లతో కలపరాదని, కానీ ముంబై పోలీసులు ఆ పనిచేశారని అన్నారు. ఐటీ చట్టంలోని 67ఏ యాక్ట్ కేవలం అశ్లీల చర్యల గురించి విశదీకరిస్తుందన్నారు.
ఇద్దరి మధ్య జరిగే శారీరక కలయిక మాత్రమే పోర్న్‌గా భావించాలని, మిగితా వాటిని కేవలం బూతుగా పరిగణించాలన్నారు. సంభోగం నిజం కానప్పుడు దాన్ని నీలి చిత్రంగా భావించరాదు అన్నారు. రాజ్‌కుంద్రా మందస్తు బెయిల్ కోసం అర్జీ పెట్టుకున్నారు. హాట్‌షాట్స్ యాప్ కోసం నీలి చిత్రాలను చేయించి.. రాజ్‌కుంద్రా విదేశీయులకు వాటిని ట్రాన్స్‌ఫర్ చేసి అప్‌లోడ్ చేసేవారని ఆరోపణలు ఉన్నాయి. చట్టానికి లోబడి రాజ్‌కుంద్రాను అరెస్టు చేయలేదని లాయర్ పోండా తెలిపారు. ఇప్పటి వరకు ఈ కేసులో 11 మందిని అరెస్టు చేశారు.