పుష్ప 2 ప్రపంచవ్యాప్తంగా 1600 కోట్లకు పైగా వసూలు చేసి పెద్ద బాక్సాఫీస్ వద్ద సంచలనంగా మారింది. హిందీ వెర్షన్ కు ఇంకా మంచి ఆదరణ లభిస్తూ ఉంది. పుష్ప 2 సినిమాలో మరిన్ని సీన్స్ యాడ్ అవ్వబోతున్నాయి. దాదాపు 20 నిమిషాల అదనపు ఫుటేజీని జోడించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
ఈ కొత్త సీన్లు క్రిస్మస్ రోజున యాడ్ చేయాలని అనుకున్నారు. కానీ వివిధ కారణాల వల్ల అమలు కాలేదు. ఈ అదనపు ఫుటేజ్‌తో సినిమాను మళ్లీ భారీగా విడుదల చేయాలనే ఆలోచనలో చిత్రబృందం ఉంది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో మేకర్స్ అధికారికంగా ధృవీకరించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు కూడా త్వరలోనే బయటకు వచ్చే అవకాశం ఉంది.