తగ్గేదే లే.. పుష్ప'ట్రైలర్ రిలీజ్‌.. ఎప్పుడంటే..!

Pushpa movie trailer time fixed. 'పుష్ప' సినిమా ట్రైలర్‌ కోసం ప్రేక్షకులు కళ్లు కాయలు కాచేలా వేచి చూస్తున్న సమయంటో.. సినిమా యూనిట్‌ రిలీజ్‌ డేట్‌ ప్రకటించింది.

By అంజి  Published on  29 Nov 2021 6:34 AM GMT
తగ్గేదే లే.. పుష్పట్రైలర్ రిలీజ్‌.. ఎప్పుడంటే..!

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ నటిస్తున్న తాజా పాన్‌ ఇండియా సినిమా పుష్ప. ఈ సినిమాలో అల్లు అర్జున్‌కు జోడిగా హీరోయిన్ రష్మిక మందన్నా నటిస్తోంది. ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ తెరకెక్కించారు. ఈ సినిమా షూటింగ్‌ను శరవేగంగా జరుపుతున్నారు. పుష్ప సినిమా రెండు పార్ట్‌లుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే తొలి పార్ట్‌ రిలీజ్‌ కోసం అల్లు అర్జున్‌ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా నుండి ఇప్పటికే శ్రీవల్లి, సామీ సామీ, ఏ బిడ్డ ఇది నా అడ్డా, దాక్కో దాక్కో మేక పాటలు, టీజర్‌లు విడుదల అయ్యి.. ఈ సినిమాపై భారీ అంచనాలను పెట్టాయి.

'పుష్ప' సినిమా ట్రైలర్‌ కోసం ప్రేక్షకులు కళ్లు కాయలు కాచేలా వేచి చూస్తున్న సమయంటో.. సినిమా యూనిట్‌ రిలీజ్‌ డేట్‌ ప్రకటించింది. సినిమా పోస్టర్‌ ద్వారా డిసెంబర్‌ 6వ తేదీన ట్రైలర్‌ విడుదల కానుందని తెలిపారు. తాజాగా విడుదల చేసిన పోస్టర్‌తో ట్రైలర్‌ రిలీజ్‌ డేట్‌పై అభిమానులకు క్లారిటీ వచ్చింది. డిసెంబర్‌ 17వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 'పుష్ప' ట్రైలర్‌ వేడుకని దుబాయ్‌లో జరపనున్నట్లు తెలిసింది. సినిమాలో ఫహాద్‌ ఫాజిల్‌, సునీల్‌, యాంకర్‌ అనసూయతో పాటు పలువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మంగళం శ్రీనుగా సునీల్‌, దాక్షాయణిగా అనసూయ నటిస్తున్నారు. ప్రముఖ హీరో ఫహద్‌ ఫాజిల్‌ ఈ సినిమాలో మెయిన్‌ విలన్‌ రోల్‌లో నటిస్తున్నారని ప్రచారం జరుగుతోంది.

Next Story
Share it