రెండో ఆదివారం కూడా దుమ్ము దులిపిన 'పుష్ప-2' క‌లెక్ష‌న్స్.. టాప్‌లో ఉంది..!

అల్లు అర్జున్, రష్మిక మందన్న నటించిన చిత్రం పుష్ప 2 ది రూల్ రోజురోజుకు బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తూ ముందుకు సాగుతోంది.

By Kalasani Durgapraveen  Published on  16 Dec 2024 6:50 AM GMT
రెండో ఆదివారం కూడా దుమ్ము దులిపిన పుష్ప-2 క‌లెక్ష‌న్స్.. టాప్‌లో ఉంది..!

అల్లు అర్జున్, రష్మిక మందన్న నటించిన చిత్రం పుష్ప 2 ది రూల్ రోజురోజుకు బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తూ ముందుకు సాగుతోంది. పుష్ప 2 విడుదలై రెండో వారం కాగా.. 11 వ రోజు కలెక్షన్లలో మరోసారి భారీ జంప్ చోటుచేసుకుంది. దీని కారణంగా సినిమా క‌లెక్ష‌న్స్ భారీగా పెరిగాయి.

రెండవ ఆదివారం పుష్ప 2 బాక్సాఫీస్ కలెక్షన్ పరంగా చాలా పెద్ద చిత్రాలను రికార్డుల‌ను ఎన‌క్కినెట్టింది. విడుదలైన మొదటి రోజు నుంచే పుష్ప 2 రికార్డ్ బ్రేకింగ్ వసూళ్లను కొనసాగిస్తోంది. ప్రారంభ వారాంతంలో అత్యధిక బాక్సాఫీస్ కలెక్షన్ల పరంగా.. పుష్ప బాలీవుడ్ నుండి సౌత్ సినిమా వరకు చాలా సినిమాలను ఓడించింది. Sacknilk నివేదిక ప్రకారం.. విడుదలైన 11వ రోజు అనగా రెండవ ఆదివారం.. పుష్ప‌-2 అన్ని భాషలలో దాదాపు 75 కోట్ల రూపాయల బిజినెస్ చేసింది. దీన్ని బట్టి చూస్తే రెండో ఆదివారం వసూళ్ల పరంగా పుష్ప - రూల్ చిత్రం టాప్‌లో నిలిచింది.

బాహుబలి-2 చిత్రం 65 కోట్లు, కేజీఎఫ్-2 చిత్రం 53 కోట్లు, క‌ల్కీ 2898 AD 52.6 కోట్లు, స్త్రీ-2 సినిమా 40.75 కోట్లు, జవాన్ 37.26 కోట్లు, యానిమ‌ల్‌ 36.53 కోట్లు వ‌సూలు చేయ‌గా.. పుష్ప‌-2 అన్నింటినీ దాటేసింది. దీంతో భారతీయ సినిమా చరిత్రలో రెండో ఆదివారం అత్యధిక వసూళ్లు సాధించిన ఏకైక చిత్రంగా పుష్ప - ది రూల్ నిలిచింది.

ఇక రెండో ఆదివారం వసూళ్ల లెక్కలను కలుపుకుంటే.. పుష్ప 2 భారతీయ బాక్సాఫీస్ వద్ద రూ.1000 కోట్ల బిజినెస్ దిశగా అడుగులు వేసింది. విడుదలైన 11 రోజుల్లో ఈ సినిమా టోటల్ కలెక్షన్ 900.5 కోట్లకు చేరుకుంది. దేశీయ బాక్సాఫీస్ వద్ద ఇప్పటి వరకు ఏ సినిమా ఇంత వసూళ్లు రాబట్టలేదు. ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ.1292 కోట్లు వ‌సూలు చేసి 1500 కోట్ల మార్క్‌కు ద‌గ్గ‌రైంది.

Next Story