పుష్ప-2 రెండో ట్రైలర్ వచ్చేస్తోంది

పాట్నాలో జరిగిన గ్రాండ్ ఈవెంట్‌లో పుష్ప 2 మొదటి ట్రైలర్‌ను విడుదల చేశారు.

By Kalasani Durgapraveen  Published on  23 Nov 2024 2:00 PM IST
పుష్ప-2 రెండో ట్రైలర్ వచ్చేస్తోంది

పాట్నాలో జరిగిన గ్రాండ్ ఈవెంట్‌లో పుష్ప 2 మొదటి ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ ప్రతిష్టాత్మకమైన పాన్-ఇండియా ప్రాజెక్ట్ కు పూణే ఈవెంట్ ఊహించని విధంగా ప్లస్ అయింది. ఉత్తరాదిలో భారీ సంచలనాన్ని సృష్టించింది. పుష్ప 2 మొదటి ట్రైలర్ ఊపును రెండో ట్రైలర్ కూడా కొనసాగించనున్నారు.

తెలుగు బయ్యర్లు ఈ చిత్రాన్ని చాలా పెద్ద ధరకు కొనుగోలు చేసారు. సినిమాకు మరింత హైప్ క్రియేట్ కావాలి. ఇక కిస్సిక్ స్పెషల్ సాంగ్ రిలీజ్ కానుంది. వచ్చే వారం 2వ ట్రైలర్‌ను కూడా విడుదల చేయనుంది చిత్రబృందం. పుష్ప 2వ ట్రైలర్‌లో యాక్షన్ ఎపిసోడ్ షాట్‌లు, కొత్త సాంగ్ షాట్‌లు ఉండనున్నాయి. సుకుమార్ అండ్ కో ఈ ట్రైలర్ తో సినిమాకి మరింత హైప్ వస్తుందని ఆశిస్తున్నాను.

Next Story