బెంగళూరులో కూడా ప్రీమియర్లున్నాయ్..!

కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలో కూడా పుష్ప-2 ప్రీమియర్లు ఉన్నాయి.

By Medi Samrat  Published on  3 Dec 2024 12:48 PM GMT
బెంగళూరులో కూడా ప్రీమియర్లున్నాయ్..!

కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలో కూడా పుష్ప-2 ప్రీమియర్లు ఉన్నాయి. డిసెంబర్ 4వ తేదీ రాత్రి 9:30 నుండి పలు స్క్రీన్స్ లో సినిమాను ప్రదర్శించబోతున్నారు. డిసెంబర్ 5 ఉదయం మాత్రమే షోలు ఉన్నాయని అభిమానులు భావించగా.. ఇప్పుడు డిసెంబర్ 4న బెంగళూరు లోని ఐకానిక్ థియేటర్లలో సినిమాను వీక్షించవచ్చు. ముకుంద, ఊర్వశి లాంటి ఐకానిక్ సింగిల్ స్క్రీన్ థియేటర్లలోనే కాకుండా, మల్టీ ప్లెక్స్ చైన్స్ లో కూడా సినిమాను విడుదల చేయనున్నారు.

అల్లు అర్జున్ పుష్ప 2 టీమ్ బ్యాక్ టు బ్యాక్ ప్రమోషన్ల కారణంగా సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేసింది. పాట్నాలో ట్రైలర్ లాంచ్ తర్వాత, సినిమా వీలైనంత ఎక్కువ మంది ప్రేక్షకులకు చేరువయ్యేలా చూసేందుకు రాష్ట్రాలలో పలు కార్యక్రమాలు నిర్వహించారు.

పుష్ప 2 ఇప్పుడు బుక్ మై షోలో ఒక మిలియన్ టిక్కెట్ల విక్రయాలను వేగంగా దాటిన భారతీయ చిత్రంగా నిలిచింది. కల్కి 2898 AD, బాహుబలి 2: ది కన్‌క్లూజన్, K.G.F సినిమాల కంటే వేగంగా పుష్ప-2 సినిమా టికెట్లను బుక్ చేశారని బుక్ మై షో ప్రతినిధులు తెలిపారు.

Next Story