ఓటీటీలోకి పుష్ప.. మరో 20 నిమిషాలు బోనస్..!
అల్లు అర్జున్ భారీ బ్లాక్ బస్టర్ సినిమా పుష్ప 2: ది రూల్ డిసెంబర్ 5, 2024 న విడుదలైంది.
By Medi Samrat Published on 27 Jan 2025 5:01 PM ISTఅల్లు అర్జున్ భారీ బ్లాక్ బస్టర్ సినిమా పుష్ప 2: ది రూల్ డిసెంబర్ 5, 2024 న విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. రూ. 1800 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం భారతీయ చలనచిత్ర చరిత్రలో చెరగని ముద్ర వేసింది. తెలుగు సినిమా చరిత్రలో సంచలనాత్మక మైలురాయిగా నిలిచింది.
ఈ సినిమా రీలోడెడ్ వెర్షన్ లో అదనంగా 20 నిమిషాల ఫుటేజీ ఉంది. దీనికి కూడా ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన లభించింది. ఈ సినిమా ఓటీటీలోకి త్వరలోనే రానుంది. ప్రముఖ ఓటీటీ జెయింట్ Netflix పుష్ప 2 OTT విడుదల తేదీని అధికారికంగా ధృవీకరించింది. జనవరి 30, 2025 నుండి సినిమాను ప్రసారం చేయనున్నారు. ఈ చిత్రం నిడివి ఓటీటీలో 3 గంటల 44 నిమిషాలు. అంటే రీలోడెడ్ వెర్షన్‌లో అందుబాటులో ఉంటుంది. బహుళ భాషలలో నెట్ ఫ్లిక్స్ లో ప్రసారమవ్వనుంది. వెండితెర మీద సంచలన ప్రదర్శన చేసిన పుష్ప-2 కొత్త స్ట్రీమింగ్ రికార్డులను నెలకొల్పుతుందనే అంచనా వేస్తున్నారు. డిజిటల్ రంగంలో పుష్ప 2 ఎలా పని చేస్తుందనే దానిపై అందరి దృష్టి ఉంది. రష్మిక మందన్న, ఫహద్ ఫాసిల్, రావు రమేష్, జగపతి బాబు, అనసూయ భరద్వాజ్, సునీల్ కీలక పాత్రలు పోషించారు.