ఒకరోజు ముందుగానే పుష్ప-2 జాతర షురూ..!

అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా మీద ప్రస్తుతం భారీ హైప్ ఉంది. ఈ సినిమాను డిసెంబర్ 6న విడుదల చేయాలని అనుకున్నారు

By Medi Samrat  Published on  24 Oct 2024 7:00 PM IST
ఒకరోజు ముందుగానే పుష్ప-2 జాతర షురూ..!

అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా మీద ప్రస్తుతం భారీ హైప్ ఉంది. ఈ సినిమాను డిసెంబర్ 6న విడుదల చేయాలని అనుకున్నారు. అయితే ఒకరోజు ముందుగానే ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకుని వస్తున్నారు. పుష్ప 2 ముందుగా డిసెంబర్ 6న విడుదల చేయాలని నిర్ణయించారు, ఇప్పుడు డిసెంబర్ 5, 2024న థియేటర్లలోకి ఈ సినిమా రానుంది. కొత్తగా విడుదల చేసిన పోస్టర్‌లో అల్లు అర్జున్ నీలిరంగు చొక్కా ధరించి, ఒక చేతిలో తుపాకీ, నోటిలో పొగ త్రాగే పైపుతో కనిపించాడు.

పుష్ప 2 నాన్ థియేట్రికల్ బిజినెస్ 420 కోట్ల మార్కును తాకింది. ఈ విషయాన్ని పుష్ప 2 మేకర్స్ ఈరోజు అధికారికంగా ధృవీకరించారు. ఈ మధ్య కాలంలో ఏ సినిమా చూసినా ఇదే ఆల్ టైమ్ రికార్డ్ అని చెబుతున్నారు. పుష్ప 2 నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు ప్రెస్ మీట్ పెట్టి ఒకరోజు ముందు సినిమాను విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు. పుష్ప 2 కొత్త బెంచ్‌మార్క్‌ను సృష్టిస్తుందని వారు చాలా నమ్మకంగా ఉన్నారు. పుష్ప 2 సినిమా మొత్తం 1000 కోట్ల బిజినెస్ చేయనుంది. ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ బిజినెస్ 600 కోట్లు, నాన్ థియేట్రికల్ బిజినెస్ 420 కోట్లుగా ఉండనుంది. ఇది భారతీయ సినిమాలో ఏ సినిమాకైనా ఆల్ టైమ్ రికార్డ్ అని చెప్పొచ్చు.

Next Story