ఇండియన్ సినిమా ఇండస్ట్రీ హిట్‌గా పుష్ప-2

పుష్ప 2 సినిమా విడుదలైనప్పటి నుంచి రికార్డుల వర్షం కురిపిస్తోంది.

By Medi Samrat  Published on  6 Jan 2025 5:46 PM IST
ఇండియన్ సినిమా ఇండస్ట్రీ హిట్‌గా పుష్ప-2

పుష్ప 2 సినిమా విడుదలైనప్పటి నుంచి రికార్డుల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమా తెలుగు వెర్షన్‌లోనే కాకుండా హిందీ వెర్షన్‌లో కూడా పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్‌గా రికార్డులను బద్దలు కొట్టింది. ఈ చిత్రం హిందీ వెర్షన్‌లో 800 కోట్లకు పైగా వసూలు చేసి అక్కడ ఇండస్ట్రీ రికార్డ్‌ను నెలకొల్పింది. పుష్ప 2 దాదాపు 1831 కోట్లు వసూలు చేసి భారతీయ సినిమా ఇండస్ట్రీ హిట్ అయ్యింది.

భారతదేశంలో బాహుబలి 2 ఇప్పటివరకు 1375 కోట్ల గ్రాస్‌తో అత్యధిక గ్రాసర్‌గా ఉంది. పుష్ప 2 భారతదేశంలోనే 1355 కోట్ల గ్రాస్‌ను కొట్టగలిగింది. అల్లు అర్జున్ ఈ ఫీట్‌తో ఖచ్చితంగా సరికొత్త రికార్డ్ సాధించాడు. ఈ రికార్డు చాలా కాలం పాటు ఉంటుందని భావిస్తున్నారు.

Next Story