400 కోట్ల మార్కును దాటిన పుష్ప-2

పుష్ప 2 సినిమా రికార్డుల మోత మోగిస్తోంది. ఇండియన్ సినిమా చరిత్రలో బిగ్గెస్ట్ ఓపెనర్‌గా నిలిచిన ఈ సినిమా.. మొదటి రోజు అన్ని రికార్డులను బద్దలు కొట్టింది.

By Kalasani Durgapraveen  Published on  7 Dec 2024 6:00 AM IST
400 కోట్ల మార్కును దాటిన పుష్ప-2

పుష్ప 2 సినిమా రికార్డుల మోత మోగిస్తోంది. ఇండియన్ సినిమా చరిత్రలో బిగ్గెస్ట్ ఓపెనర్‌గా నిలిచిన ఈ సినిమా.. మొదటి రోజు అన్ని రికార్డులను బద్దలు కొట్టింది. ఈ సినిమా రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.400 కోట్లు వసూలు చేసింది. సుకుమార్ దర్శకత్వం వహించిన తెలుగు యాక్షన్ డ్రామా 2021లో విడుదలైన పుష్ప: ది రైజ్‌కి సీక్వెల్.. అంచనాలకు ఏ మాత్రం తీసిపోకుండా ఈ సినిమా నిలిచింది. పుష్ప 2 ప్రపంచవ్యాప్తంగా రూ. 400 కోట్ల గ్రాస్ మార్క్‌ను అందుకుంది.

బహుళ భాషల్లో విడుదలైన పుష్ప 2, 2వ రోజు అన్ని వెర్షన్‌లలో బలమైన ఆక్యుపెన్సీని చూసింది. తెలుగులో, సినిమా మొత్తం 53 శాతం ఆక్యుపెన్సీని నమోదు చేయగా, హిందీలో 51.65 శాతంగా ఉంది. తమిళంలో 38.52 శాతం, కన్నడలో 35.97 శాతం, మలయాళంలో 27.30 శాతం ఆక్యుపెన్సీ ఉంది.

Next Story