పుష్ప 2 సినిమా మరో రికార్డును అందుకుంది. బుక్ మై షో లో 19 మిలియన్ల టిక్కెట్లు అమ్ముడయ్యాయి. టికెటింగ్ యాప్, బుక్‌మైషో దేశవ్యాప్తంగా సినిమా టిక్కెట్ల విక్రయాలను ట్రాక్ చేస్తుంది. అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 టిక్కెట్ విక్రయాలకు సంబంధించి రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది. బుక్ మై షోలో పుష్ప 2 సినిమాకు 19 మిలియన్ టిక్కెట్లు అమ్ముడయ్యాయి.
థియేటర్లలో రికార్డ్ రన్‌ను పుష్ప-2 సినిమా కొనసాగిస్తూ ఉంది. డిసెంబర్ 29 వరకు ఈ చిత్రానికి సంబంధించి బుక్ మై షోలో 19.2 మిలియన్ టిక్కెట్లు అమ్ముడయ్యాయి. బుక్ మైషోలో ఒక చిత్రం 19 మిలియన్ల టికెట్లను దాటడం ఇదే మొదటిసారి. ఈ చిత్రం థియేటర్లలో బలమైన రన్‌ను కొనసాగిస్తున్నందున ఖచ్చితంగా 20 మిలియన్ బెంచ్ మార్క్ ను దాటుతుంది. ఇక పుష్ప 2 సినిమా 25 రోజులకు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1542 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద దంగల్, బాహుబలి 2 తర్వాత 1500 కోట్ల గ్రాస్ వసూలు చేసిన మూడవ భారతీయ చిత్రంగా ఈ చిత్రం నిలిచింది.