డేటింగ్ లో లేను.. వదిలేయండి : ఐశ్వర్య

PS-1 Star Aishwarya Lekshmi Is Not Dating Arjun Das. అలనాటి విలన్ రఘువరన్ కుమారుడు అర్జున్ దాస్ తమిళ చిత్ర పరిశ్రమలో రాణిస్తూ ఉన్నాడు.

By Medi Samrat
Published on : 13 Jan 2023 8:15 PM IST

డేటింగ్ లో లేను.. వదిలేయండి : ఐశ్వర్య

అలనాటి విలన్ రఘువరన్ కుమారుడు అర్జున్ దాస్ తమిళ చిత్ర పరిశ్రమలో రాణిస్తూ ఉన్నాడు. నటి ఐశ్వర్య లక్ష్మి కూడా మంచి పేరు సంపాదించుకుంటూ ఉంది. ఇలాంటి సమయంలో అర్జున్ దాస్, ఐశ్వర్య కలిసి ఉన్న ఫోటో సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. ఐశ్వర్య అర్జున్ దాస్ తో ఉన్న ఫోటోతో పాటూ.. రెండు లవ్ సింబల్స్ ను పెట్టింది. దీంతో వాళ్లిద్దరూ డేటింగ్ లో ఉన్నారని అందరూ భావిస్తూ ఉన్నారు. ఐశ్వర్య లక్ష్మి, అర్జున్ దాస్ డేటింగ్ చేస్తున్నారనే పుకార్లతో సోషల్ మీడియా నిండిపోయింది.

దీంతో ఐశ్వర్య ఒక క్లారిటీ ఇచ్చింది. ఇందులో ఏ మాత్రం నిజం లేదని నటి మరో పోస్టులో వివరణ ఇచ్చింది. ఐశ్వర్య లక్ష్మి గురువారం ఇన్‌స్టాగ్రామ్‌లో అర్జున్ దాస్ తో సెల్ఫీని పంచుకున్న తర్వాత పుకార్లు మొదలయ్యాయి. డేటింగ్ చేస్తున్నారా అని అడిగే అభిమానుల కామెంట్స్ ఎక్కువయ్యాయి. ఊహాగానాలకు ముగింపు ఇస్తూ, ఐశ్వర్.. ఇది ఇలా వైరల్ అవుతుందని ఊహించలేదు. మేము సరదాగా కలుసుకోవడం జరిగింది, ఒక ఫోటో తీసుకుని నేను దానిని పోస్ట్ చేసాను. ఇక్కడ మా మధ్య ఏమీ లేదు. మేము స్నేహితులు. నాకు మెసేజ్ చేస్తున్న అర్జున్ దాస్ అభిమానులందరూ నిశ్చింతగా ఉండండి. ఆయన మీ వాడే అని తెలిపింది.


Next Story