'ప్రాజెక్ట్ K'.. మరోసారి దేవుడి పాత్రలో ప్రభాస్..?

Project K Plot line revealed Prabhas playing the Lord Vishnu role in the film. ప్రభాస్, నాగ్ అశ్విన్‌ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా 'ప్రాజెక్ట్ K'.

By Medi Samrat  Published on  2 July 2023 8:45 PM IST
ప్రాజెక్ట్ K.. మరోసారి దేవుడి పాత్రలో ప్రభాస్..?

ప్రభాస్, నాగ్ అశ్విన్‌ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా 'ప్రాజెక్ట్ K'. పాన్ వరల్డ్ సినిమాగా ఇది తెరకెక్కుతోంది. చాలా కాలంగా నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమాకు సంబంధించిన రూమర్స్ సోషల్ మీడియాలో చాలానే వినిపిస్తూ ఉన్నాయి. తాజా నివేదికల ప్రకారం ఈ చిత్రంలో ప్రభాస్ మరోసారి దేవుడి పాత్రలో కనిపించబోతున్నారని అంటున్నారు. విష్ణువు పాత్రలో పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ కనిపించబోతున్నారని అంటున్నారు.

భారతీయ పౌరాణిక అంశాలు, నేటి శాస్త్ర సాంకేతికత మిళితమై ఈ చిత్రం ఉంటుందని.. ప్రభాస్ విష్ణువు అవతారంలో కనిపిస్తాడని అంటున్నారు. ఈ ఆధునిక కాలంలోని చెడ్డ వ్యక్తులతోనూ.. పలు శక్తులతోనూ పోరాడతాడని అంటున్నారు. నాగ్ అశ్విన్ అన్ని ఎలిమెంట్స్ ను పర్ఫెక్ట్ గా మిళితం చేసి భారీ విజువల్ వండర్ గా తీర్చిదిద్దాలని భావిస్తూ ఉన్నాడు.

‘మహానటి’ తో వండర్ క్రియేట్ చేసిన దర్శకుడు నాగ్ అశ్విన్. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే లాంటి స్టార్స్ ఈ సినిమాలో ఉన్నారు. ఈ సినిమా బడ్జెట్ రూ.500 కోట్లు దాటిపోయిందని అంటున్నారు. ఇది సైన్స్ ఫిక్షన్ కథ అయినప్పటికీ ఫాంటసీ కూడా ఉండనుంది. చెడు మీద మంచి విజయం సాధించడం అనే యూనివర్శల్ పాయింట్ ఆధారంగా సినిమా తెరకెక్కుతోందని అంటున్నారు. అమితాబ్, ప్రభాస్, కమల్.. ఈ ముగ్గురూ ఇందులో శాస్త్రవేత్తలుగా కనిపించనుండగా.. ప్రభాస్ ఇందులో విష్ణువు అవతారంలోనూ కనిపించనున్నట్లుగా ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఈ చిత్రాన్ని జనవరి 12, 2024న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేస్తామని ఇంతకు ముందు తెలిపారు. అయితే ఆ డేట్ కు వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది.


Next Story