నా మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారు

నిర్మాత ఎస్కేఎన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.

By Medi Samrat  Published on  18 Feb 2025 8:45 PM IST
నా మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారు

నిర్మాత ఎస్కేఎన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. తెలుగు అమ్మాయిలకు హీరోయిన్లుగా అవకాశాలు ఇస్తే, ఆ తర్వాత ఏం జరుగుతోందో అందరికీ తెలిసిందేనని ఎస్కేఎన్ అన్నారు. అందుకే ఇకపై తాము తెలుగమ్మాయిలను హీరోయిన్లుగా ఎంకరేజ్ చేయదల్చుకోలేదని ఎస్కేఎన్ చెప్పినట్లు కథనాలు వచ్చాయి.

దీనిపై నిర్మాత ఎస్కేఎన్ వివరణ ఇచ్చారు. తెలుగమ్మాయిలను హీరోయిన్లుగా పరిచేయం చేసిన అతి కొద్ది మంది నిర్మాతల్లో తాను ఒకరినని ఎస్కేఎన్ తెలిపారు. రేష్మ, ఆనంది, మానస, ప్రియాంక జవాల్కర్, వైష్ణవి చైతన్య, ఐశ్వర్య, ఖుషితలను పరిచయం చేశామని, త్వరలో హారిక, మరో కొత్త అమ్మాయిని కూడా పరిచయం చేయబోతున్నామన్నారు. 25 మంది అమ్మాయిలను హీరోయిన్లుగా, రైటర్లుగా, ఆర్ట్ డైరెక్టర్లుగా, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలుగా, డైరెక్టర్లుగా ప్రోత్సహించానన్నారు. కొంచెం సరదాగా చేసిన వ్యాఖ్యలను పట్టుకుని, తెలుగమ్మాయిలతో ఇక వర్క్ చేయొద్దు అని అన్నట్టుగా ప్రచారం చేస్తున్నారు. నా రాబోయే చిత్రాల్లో కూడా తెలుగమ్మాయిలకే ప్రాధాన్యత ఉంటుందని, ఎలాంటి వ్యతిరేక ప్రచారం చేయొద్దని కోరుతున్నానన్నారు.

Next Story