పవన్ సినిమా ఆపే దమ్ము, ధైర్యం ఎవరికీ లేదు: దిల్‌రాజు
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. సినీ ఇండస్ట్రీకి ఎంతగానో సపోర్ట్ చేశారని సినీ నిర్మాత దిల్ రాజు అన్నారు. గత ప్రభుత్వ హయాంలో సాయం అడగడానికి భయపడాల్సి వచ్చేదని చెప్పారు.
By అంజి
పవన్ సినిమా ఆపే దమ్ము, ధైర్యం ఎవరికీ లేదు: దిల్‌రాజు
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. సినీ ఇండస్ట్రీకి ఎంతగానో సపోర్ట్ చేశారని సినీ నిర్మాత దిల్ రాజు అన్నారు. గత ప్రభుత్వ హయాంలో సాయం అడగడానికి భయపడాల్సి వచ్చేదని చెప్పారు. వపన్ వచ్చిన తర్వాత నిర్మాతలు ఏపీకి పక్కింటికి వెళ్లొచ్చినట్టు వెళ్లొస్తున్నారని తెలిపారు. ఓ అప్లికేషన్ లేదా ఫోన్‌లో మాట్లాడితే టికెట్ల ధరలు పెరిగిపోతున్నాయన్నారు. అంతేకానీ ప్రొడ్యూసర్లు కలిసి యూనిటీగా ప్రభుత్వాన్ని కలవాలనే ఆలోచన చేయడం లేదని వ్యాఖ్యానించారు. పవన్ సినిమాను ఆపే దమ్ము, ధైర్యం ఎవరూ చేయలేరని దిల్ రాజు అన్నారు.
థియేటర్ల మూసివేత అంశంపై ఏపీ ప్రభుత్వానికి రాంగ్ కమ్యూనికేషన్ వెళ్లిందన్నారు. అందుకే మంత్రి కందుల దుర్గేష్ స్పందించారని, ఆయన తనకు ఫోన్ చేస్తే మూసివేత లేదని చెప్పానన్నారు. జూన్‌లో పవన్ సహా పలువురి సినిమాలు ఉన్నాయని, పరిశ్రమ మేలు కోసం పవన్ ఎంతో చేశారని అన్నారు. వ్యక్తిగతంగా తప్పితే ఛాంజర్ ద్వారా ప్రభుత్వాన్ని కలవాలని ఎవరూ ఆలోచించలేదని తెలిపారు. జూన్ 1 నుంచి థియేటర్ల బంద్ అంటూ మీడియాలో దుష్ప్రచారం జరిగిందని దిల్‌రాజు అన్నారు. తూర్పు గోదావరి జిల్లా ఎగ్జిబిటర్ల సమావేశం వల్లే ఈ టాపిక్ మొదలైందన్నారు. ఇది ఆ జిల్లా విషయం మాత్రమేనని, రెంట్ లేదా పర్సంటేజ్ పద్ధతిలో ఆడే సినిమాల విషయంలోనే ఎగ్జిబిటర్లకు సమస్య ఉందన్నారు.
సినిమా రిలీజైన తొలి వారం రెంట్, రెండో వారం పర్సంటేజ్ ఇస్తున్నామని, అయినా వాళ్లకు ఎందుకు నష్టం వస్తుందో ఆరా తీశామని తెలిపారు. 'గేమ్ ఛేంజర్' సినిమా రిలీజైన తొలి రోజే పైరసీ బయటకు వచ్చిందని ఆ సినిమా నిర్మాత దిల్ రాజు తెలిపారు. అయితే నిర్మాతే కావాలని పైరసీ చేసి ఉంటాడని ఓ మాజీ ప్రొడ్యూసర్ అన్నారని, ఇది ఎంత నీచం అంటూ అసహనం వ్యక్తం చేశారు. నిర్మాతగా తన సినిమాను తాను కాపాడుకుంటా కానీ పైరసీ చేస్తానా? అని దిల్ రాజు ప్రశ్నించారు. తెలంగాణలో 370 థియేటర్లు ఉంటే.. అందులో 30 మాత్రమే తనకు సంబంధించినవని దిల్‌రాజు తెలిపారు.