పాయల్ రాజ్ పుత్ వ్యాఖ్యలను ఖండించిన ప్రొడ్యూసర్ కౌన్సిల్

సినీ నిర్మాత ప్రణ్‌దీప్ ఠాకూర్‌పై నటి పాయల్ రాజ్‌పుత్ సోషల్ మీడియా పోస్ట్‌ను తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ (TFPC) తీవ్రంగా ఖండించింది.

By Medi Samrat  Published on  21 May 2024 10:00 AM IST
పాయల్ రాజ్ పుత్ వ్యాఖ్యలను ఖండించిన ప్రొడ్యూసర్ కౌన్సిల్

సినీ నిర్మాత ప్రణ్‌దీప్ ఠాకూర్‌పై నటి పాయల్ రాజ్‌పుత్ సోషల్ మీడియా పోస్ట్‌ను తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ (TFPC) తీవ్రంగా ఖండించింది. తనకు అందించాల్సిన పేమెంట్ ను ఇవ్వలేదని.. అంతేకాకుండా తాను ప్రమోషన్స్ కు హాజరవ్వకపోవడంతో తనను తెలుగు చిత్ర పరిశ్రమ నుండి బ్యాన్ చేస్తామని బెదిరిస్తున్నారని పాయల్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది. తాను ఎటువంటి తప్పూ చేయలేదని.. అయినా కూడా తన మీద నిందలు వేస్తూ ఉండడంతో లీగల్ గా పోరాడడానికి తన టీమ్ తో సిద్ధమైనట్లు పాయల్ తెలిపింది.

పాయల్ రాజ్‌పుత్‌ కథానాయికగా “రక్షణ” అనే చిత్రాన్ని రూపొందించారు. సినిమా ఆలస్యమవ్వడంతో టైటిల్ మార్చారు. TFPC ప్రకారం.. నిర్మాత పాయల్ రాజ్‌పుత్‌పై ఈ సంవత్సరం మార్చిలో ఫిర్యాదు చేశారు, ఈ చిత్రం నాలుగు సంవత్సరాలుగా నిర్మాణంలో ఉన్నందున దానిని ప్రమోట్ చేయడానికి పాయల్ నిరాకరించింది. TFPC ప్రకటన ప్రకారం.. పాయల్ రాజ్‌పుత్ సమస్య సామరస్య పరిష్కారం కోసం కౌన్సిల్ అభ్యర్థనలకు ప్రతిస్పందించడంలో విఫలమవ్వడమే కాకుండా, ఆమె మేనేజర్ కూడా అనైతికంగా ప్రవర్తించారు. నిర్మాత తన రెమ్యునరేషన్‌లో మిగిలిన రూ. 6 లక్షలను క్లియర్ చేయడానికి అంగీకరించినప్పటికీ.. షూటింగుకు 50 రోజులు, ప్రమోషన్ కోసం అదనపు సమయం కావాలనే నిబంధనను పాటించడంలో ఆమె విఫలమైంది. అందువల్ల, కౌన్సిల్ డిజిటల్ మీడియాలో పాయల్ రాజ్‌పుత్ చేసిన ప్రకటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు TFPC పేర్కొంది.

Next Story