తన బిడ్డను ప్రపంచానికి చూపించిన ప్రియాంక

Priyanka Chopra Reveals Daughter's Face To The World. సెలెబ్రిటీలు తమ పిల్లలను చిన్న వయసులో ప్రపంచానికి చూపించకుండా ఉండేందుకు చాలా కష్టాలే పడుతూ

By M.S.R
Published on : 31 Jan 2023 6:00 PM IST

తన బిడ్డను ప్రపంచానికి చూపించిన ప్రియాంక

సెలెబ్రిటీలు తమ పిల్లలను చిన్న వయసులో ప్రపంచానికి చూపించకుండా ఉండేందుకు చాలా కష్టాలే పడుతూ ఉంటారు. ఆ లిస్టులో ప్రియాంక చోప్రా కూడా ఒకరు. నటి ప్రియాంక చోప్రా జోనాస్, భర్త నిక్ జోనాస్ ఈ రోజు తమ కుమార్తెను అధికారికంగా ప్రపంచానికి పరిచయం చేశారు. మాల్టీ మేరీ ముఖాన్ని మీడియాకు, అభిమానులకు మొదటిసారిగా చూపించారు. నిక్ జోనాస్, అతని సోదరులు కెవిన్, జో హాజరైన జోనాస్ బ్రదర్స్ వాక్ ఆఫ్ ఫేమ్ వేడుకలో ప్రియాంక కుమార్తె ఫేస్ ను రివీల్ చేయాల్సి వచ్చింది. జోనాస్ ఫ్యామిలీతో కలిసి గ్రూప్ పిక్చర్ కోసం పోజులిచ్చారు. ప్రియాంక చోప్రా తన కుమార్తెను ఒంట్లో కూర్చోపెట్టుకుని కనిపించింది.

ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్ గతేడాది సరోగసీ ద్వారా బిడ్డను స్వాగతించారు. పలు హిందీ చిత్రాలలోనూ, హాలీవుడ్ లోనూ నటించిన ప్రియాంక చోప్రా తన కుమార్తెకు సంబంధించి చాలా ఫోటోలను పోస్ట్ చేసింది, కానీ ఆమె తన ముఖాన్ని బహిర్గతం చేయలేదు.

Next Story