చర్మం రంగు గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన నటి..!
Priyanka Chopra Comments About Her Skin. ప్రియాంక చోప్రా చర్మం రంగు గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
By Medi Samrat Published on 27 Jan 2021 12:41 PM ISTసాధారణంగా అందంగా కనిపించాలంటే తెల్లగా ఉండాలని చాలా మంది భావిస్తుంటారు. తెల్లగా కనిపించడం కోసం ఏవేవో ప్రయత్నాలు చేస్తూ మార్కెట్లో దొరికే రకరకాల ఫెయిర్ నెస్ క్రీములను వాడుతూ ఉంటారు. ఈ విధంగా వారి చర్మ రంగును మార్చుకోవడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ చర్మం రంగు పై తాజాగా బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అందంగా కనిపించాలంటే చర్మం రంగు ముఖ్యం కాదని తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రియాంక చోప్రా తెలియజేశారు.
ఇంటర్వ్యూలో భాగంగా ప్రియాంక చోప్రా మాట్లాడుతూ.. చిన్నప్పుడు నల్లగా ఉంటే అందంగా కనిపించరు అనే అభిప్రాయం నాలో ఎక్కువగా ఉండేదని, అందుకోసమే తెల్లగా కనిపించడం కోసం వివిధ రకాల పౌడర్లు, క్రీములు రాసుకునేదానిని. కానీ అందంగా కనిపించాలంటే చర్మం రంగు ముఖ్యం కాదని తెలుసుకున్నాను అంటూ ఈ సందర్భంగా ప్రియాంక చోప్రా తెలియజేశారు. 10 సంవత్సరాల క్రితం ఒక" ఫెయిర్ నెస్ క్రీమ్" ఉత్పత్తికి ప్రచారకర్తగా వ్యవహరించినట్లు ఈ సందర్భంగా ఆమె తెలిపారు.
10 సంవత్సరాల క్రితం ఈ ప్రకటనలో నేను నటించడం పట్ల ఎంతో మంది నన్ను విమర్శించారు. రంగుని, జాత్యాహంకారాన్ని ప్రమోట్ చేస్తున్నట్లే అని అన్నారు. సినిమారంగంలో ఉంటూ రంగు గురించి ఆలోచించడం సర్వసాధారణమే. తెల్లగా ఉండాలనుకోవడం ప్రతి ఒక్కరిలో సహజమైన ఆలోచన. కానీ ఫెయిర్ నెస్ క్రీమ్ ఉత్పత్తికి ప్రచారకర్తగా వ్యవహరించడం సరికాదనిపించింది. అందుకు ఇప్పుడు పశ్చాతాప పడుతున్నానంటూ ఆమె తెలియజేశారు.
మా కుటుంబంలో అందరూ తెల్లగా ఉంటారు.కానీ మా నాన్న నల్లగా ఉండటం వల్ల అతని రంగు నాకు వచ్చింది. చిన్నప్పుడు అందరు నన్ను ఇంట్లో కాలీ.. కాలీ అని పిలిచేవారు.అందరూ ఆ విధంగా పిలవడం వల్ల ఎలాగైనా తెల్లగా కావాలని అనుకున్నాను అంటూ, ఇంతకీ కాలీ అంటే నలుపు రంగు అని అర్థం. అంటూ ప్రియాంక చోప్రా తాజాగా చర్మం రంగు గురించి కొన్ని విషయాలను తెలియజేశారు.