ఓటీటీలోకి వచ్చేసిన క్రేజీ సినిమా

ప్రియదర్శి-నభా నటేష్ కలిసి నటించిన సినిమా 'డార్లింగ్'. ఈ చిత్రం జూలై 19, 2024న థియేటర్లలో విడుదలైంది

By Medi Samrat  Published on  13 Aug 2024 9:45 PM IST
ఓటీటీలోకి వచ్చేసిన క్రేజీ సినిమా

ప్రియదర్శి-నభా నటేష్ కలిసి నటించిన సినిమా 'డార్లింగ్'. ఈ చిత్రం జూలై 19, 2024న థియేటర్లలో విడుదలైంది. రొమాంటిక్ కామెడీ డ్రామాలో ప్రియదర్శి.. రాఘవ్ అనే యువకుడిగా ట్రావెల్ ఏజెన్సీలో పని చేస్తూ పారిస్‌లో పెళ్లి చేసుకుని హనీమూన్‌కు వెళ్లాలని కలలు కంటుంటాడు. మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ ఉన్న నభా నటేష్ ని అతను పెళ్లి చేసుకుంటాడు. ఆ తర్వాత వాళ్ల జీవితంలో ఏమి జరిగిందన్నది అసలు కథ.

డార్లింగ్ థియేటర్లలో విడుదలైన తర్వాత బాక్సాఫీస్ వద్ద మంచి ప్రదర్శన ఇవ్వలేకపోయింది. దర్శకుడు అశ్విన్ రామ్ 'డార్లింగ్'ని ఒక కామెడీ సినిమాగా మార్చడానికి ప్రయత్నించాడు.. కానీ కథలో గందరగోళం కారణంగా సినిమా అంతగా ఎక్కలేదు. అయితే ఈ సినిమా థియేట్రికల్ రన్ పూర్తవ్వడంతో OTT స్ట్రీమింగ్ తొందరగానే జరిగిపోయింది. డార్లింగ్ సినిమా.. ఇప్పుడు OTTలో అందుబాటులో ఉంది. థియేటర్లలో విడుదలైన మూడు వారాల్లోనే డిజిటల్‌గా అరంగేట్రం చేసింది. డార్లింగ్ ఆగస్ట్ 13, 2024 నుండి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో అందుబాటులో ఉంది.

Next Story