మీ మొబైల్స్ లోకి 'కాంతారా' వచ్చేస్తోంది..!

Prime Video announces exclusive streaming of 'Kantara'. మీ మొబైల్ ఫోన్స్ లోకి కాంతారా సినిమా వచ్చేస్తోంది.

By Medi Samrat
Published on : 23 Nov 2022 8:00 PM IST

మీ మొబైల్స్ లోకి కాంతారా వచ్చేస్తోంది..!

మీ మొబైల్ ఫోన్స్ లోకి కాంతారా సినిమా వచ్చేస్తోంది. కాంతార సినిమా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే..! ఇక ఓటీటీలో సినిమా విడుదలకు సంబంధించి కూడా ఎంతో ఆత్రుతగా మూవీ లవర్స్ ఎదురుచూస్తూ ఉన్నారు. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో రేపటి నుంచి కాంతార చిత్రం తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో ప్రసారం కానుంది. కన్నడ హీరో రిషబ్‌ శెట్టి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం కాంతార. సెప్టెంబర్‌ 30న కన్నడలో రిలీజైన ఈ మూవీ తెలుగులో అక్టోబర్‌ 15న విడుదలైంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు రూ.400 కోట్ల మేర కలెక్షన్లు రాబట్టింది. ఈ చిత్రాన్ని హోంబలే ఫిలింస్‌ నిర్మించింది.

కేవలం రూ. 16 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. రూ. 400 కోట్ల వసూళ్లను సాధించింది. అతి తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం రూ. 400 కోట్ల క్లబ్ లో అడుగుపెట్టింది. కన్నడలో ఈ సినిమా ఇప్పటి వరకు రూ. 168.50 కోట్లను వసూలు చేసింది. 'కాంతార' చిత్రాన్ని రిషబ్ శెట్టి నటిస్తూ, తానే దర్శకత్వం వహించారు.


Next Story