త్వరలో మహేష్ బాబు-రాజమౌళి సినిమా ప్రెస్ మీట్

మహేష్ బాబు-రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా SSMB29.

By Medi Samrat  Published on  25 Jan 2025 7:45 PM IST
త్వరలో మహేష్ బాబు-రాజమౌళి సినిమా ప్రెస్ మీట్

మహేష్ బాబు-రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా SSMB29. ఈ సినిమా మొదలుపెట్టడానికి ముందు ప్రెస్ మీట్ పెట్టనున్నారు. దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రతి సినిమా సెట్స్‌పైకి వెళ్లే ముందు ప్రెస్ మీట్ పెట్టడం ఆనవాయితీ. మగధీర, ఈగ, RRR వంటి చిత్రాలకు ముందు కూడా అదే చేసాడు. సినిమా కథాంశం, ప్రధాన పాత్రల గురించి అందరికీ తెలియజేస్తుంటారు.

మహేష్, రాజమౌళిల చిత్రం ప్రకటించినప్పటి నుండి, మహేష్ అభిమానులు, ప్రేక్షకులు SSMB 29 సినిమా ప్రెస్ మీట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొదటి షెడ్యూల్ పూర్తయిన తర్వాత ప్రెస్ మీట్ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అతి త్వరలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాను భారీ ఎత్తున తెరకెక్కించనున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు, ప్రియాంక చోప్రా ఇప్పుడు సినిమా కోసం రిహార్సల్స్ చేస్తున్నారు. మలయాళ నటుడు, నిర్మాత పృథివీరాజ్ సుకుమారన్ కూడా ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించనున్నారు.

Next Story