క్రేజీ సినిమాలో అవకాశం దక్కించుకున్న వంటలక్క

Premi Viswanath Roped In for Naga Chaitanya's Upcoming Film. వంటలక్క.. తెలుగు సీరియల్స్ చూసే వారికి ఇదొక పేరు కాదు.. ఎమోషన్..

By Medi Samrat  Published on  14 Oct 2022 8:30 PM IST
క్రేజీ సినిమాలో అవకాశం దక్కించుకున్న వంటలక్క

వంటలక్క.. తెలుగు సీరియల్స్ చూసే వారికి ఇదొక పేరు కాదు.. ఎమోషన్..! అంతలా 'కార్తీక దీపం' సీరియల్ తెలుగువారి ఇళ్లల్లోకి లోకి వెళ్ళిపోయింది. సీరియల్స్ చూసే వారే కాదు.. మీమర్స్ కూడా ఆమెకు ఫ్యాన్స్ అని చెప్పుకుంటూ ఉంటారు. కార్తీక దీపం సీరియ‌ల్‌లో వంట‌ల‌క్క పాత్ర‌తో పాపులారిటీని సంపాదించుకున్న ప్రేమీ విశ్వ‌నాథ్ తెలుగు సినిమాల్లో కూడా నటించడానికి సిద్ధమైపోయింది.

టాలీవుడ్ యువ హీరో నాగచైత‌న్య ప్ర‌స్తుతం త‌మిళ ద‌ర్శ‌కుడు వెంక‌ట్ ప్ర‌భుతో సినిమా చేస్తున్నాడు. తెలుగు, త‌మిళ భాష‌ల్లో NC 22 గా వ‌స్తున్న ఈ చిత్రంలో ఉప్పెన ఫేం కృతిశెట్టి ఫీ మేల్ లీడ్ రోల్‌లో న‌టిస్తోంది. ఈ సినిమాలోనే ఆమె నటిస్తూ ఉన్నారు. ప్రేమీ విశ్వ‌నాథ్‌ను NC 22 ప్రాజెక్ట్‌లోకి స్వాగ‌తం ప‌లుకుతూ స్పెష‌ల్ పోస్ట‌ర్ విడుద‌ల చేశారు మేక‌ర్స్. శ్రీనివాసా సిల్వ‌ర్ స్క్రీన్ బ్యాన‌ర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఇళ‌య‌రాజా, యువ‌న్ శంక‌ర్ రాజా క‌లిసి సంగీతం అందిస్తున్నారు. బంగార్రాజు సినిమా త‌ర్వాత నాగ‌చైత‌న్య‌, కృతిశెట్టి కాంబినేష‌న్‌లో వ‌స్తున్న రెండో సినిమా ఇది. ఈ చిత్రంలో ప్రియ‌మ‌ణి కూడా నటిస్తోంది. శ‌ర‌త్‌కుమార్‌, అర‌వింద్ స్వామి, వెన్నెల కిశోర్‌, ప్రేమ్‌గీ అమ‌రేన్‌, సంప‌త్ రాజ్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.


Next Story