ఆ రెండు సినిమాల కంటే బెటర్ గా కలెక్షన్స్ సాధిస్తున్న 'ప్రేమలు'

మలయాళంలో ఘనవిజయం సాధించిన ప్రేమలు సినిమా తమిళనాడు బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ ను సొంతం చేసుకుంది.

By Medi Samrat  Published on  15 March 2024 8:30 PM IST
ఆ రెండు సినిమాల కంటే బెటర్ గా కలెక్షన్స్ సాధిస్తున్న ప్రేమలు

మలయాళంలో ఘనవిజయం సాధించిన ప్రేమలు సినిమా తమిళనాడు బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ ను సొంతం చేసుకుంది. ఇక మంజుమ్మెల్ బాయ్స్, భ్రమయుగంతో పాటు, ప్రేమలు ఫిబ్రవరిలో బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ ను అందుకుంది. మంజుమ్మెల్ బాయ్స్ మలయాళ చిత్ర పరిశ్రమ ఇండస్ట్రీ హిట్‌గా అవతరించింది.

ఇక 'ప్రేమలు' తెలుగు వెర్షన్ కు తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. ఈ సినిమాకు తెలుగు ప్రేక్షకుల నుండి సానుకూలంగా స్పందన వచ్చింది. ప్రేమలు తెలుగు వెర్షన్లు స్లో నోట్‌లో ప్రారంభమై.. రోజురోజుకు షోల కౌంట్ పెరుగుతూ ఉంది. ఇక బుక్ మై షోలో ఇప్పుడు భీమా, గామి కంటే ఈ చిత్రంకే ఎక్కువ టిక్కెట్లు అమ్ముడవుతున్నాయి. భీమా, గామి కలెక్షన్స్ రోజురోజుకు తగ్గుతున్నాయి. ప్రేమలు 2వ వారాంతం కలెక్షన్స్.. మొదటి వారం కంటే ఎక్కువ కలెక్షన్స్ వస్తున్నాయి. ప్రస్తుత ట్రెండ్‌ను పరిశీలిస్తే.. ప్రేమలు సినిమా తెలుగు రాష్ట్రాల్లో రెండంకెల గ్రాస్ వసూలు చేసే అవకాశం ఉంది. ఈ సినిమా తెలుగు వెర్షన్ యూఎస్‌లో కూడా మంచి వసూళ్లు రాబట్టింది.

Next Story