'ఏ' సర్టిఫికేట్ ఇవ్వడంపై నీల్ ఆగ్రహం

సలార్ సినిమాకు 'ఎ' సర్టిఫికేట్‌ ఇచ్చిన సెన్సార్ బృందంపై ప్రశాంత్ నీల్ విమర్శలు గుప్పించారు.

By Medi Samrat  Published on  20 Dec 2023 3:00 PM GMT
ఏ సర్టిఫికేట్ ఇవ్వడంపై నీల్ ఆగ్రహం

సలార్ సినిమాకు 'ఎ' సర్టిఫికేట్‌ ఇచ్చిన సెన్సార్ బృందంపై ప్రశాంత్ నీల్ విమర్శలు గుప్పించారు. సలార్ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల అవ్వడానికి సిద్ధంగా ఉంది. ఈ సినిమా ఇటీవలే సెన్సార్ పూర్తయింది. సలార్ ఎ సర్టిఫికేట్‌పై సెన్సార్ బృందం నిరాశపరిచిందని ప్రశాంత్ నీల్ తెలిపారు. ఈ సినిమా సెన్సార్ సమయంలో తాను ఎదుర్కొన్న సమస్యలను ఎస్ఎస్ రాజమౌళికి తెలిపారు. సెన్సార్ అధికారులు చాలా కట్స్ చేశారని ప్రశాంత్ పేర్కొన్నాడు. అవన్నీ చేయడంలో ఓకే కానీ.. కొన్ని కట్‌లు తీసివేయడం తనకు ఎలాంటి ఇష్టం లేదని అన్నారు. ఎందుకంటే అవి సినిమా కథపై ప్రభావం చూపుతాయన్నారు

సెన్సార్ బోర్డు పలు సన్నివేశాల్లో కట్‌లు కోరిందనే వాస్తవాన్ని ఆయన బయటపెట్టారు. కొన్ని ప్రత్యేకమైన షాట్‌లను తొలగించడం వల్ల కొన్ని ఆమోదయోగ్యమైనప్పటికీ, సినిమాపై గణనీయమైన ప్రభావం చూపుతుందని నీల్ అభిప్రాయపడ్డాడు. సినిమా అసభ్యంగా లేకున్నా కూడా.. కేవలం హింస కారణంగా ఏ సర్టిఫికెట్ ఇవ్వడంతో నిరాశకు గురయ్యానన్నారు. కట్స్ గురించి ప్రభాస్‌కి చెప్పినప్పుడు, ఏ సర్టిఫికేట్ కోసం వెళ్లమని సలహా ఇచ్చాడన్నారు. సలార్ సినిమాలో ఒక్క అసభ్యకరమైన సన్నివేశం కూడా ఉండదని అన్నారు.

సలార్‌లో శ్రుతి హాసన్, పృథ్వీరాజ్ సుకుమారన్, టిన్ను ఆనంద్, జగపతి బాబు, ఈశ్వరీ రావు, బాబీ సింహా కీలక పాత్రల్లో నటించారు. రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. భారీ అంచనాలతో సలార్: పార్ట్ 1 డిసెంబర్ 22, 2023న థియేటర్లలో విడుదల కానుంది.

Next Story