అధికారికంగా మొదలైన ప్రశాంత్ నీల్-ఎన్టీఆర్ సినిమా

ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్‌ల కాంబినేషన్ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం నేడు అధికారికంగా ప్రారంభమైంది

By Medi Samrat  Published on  9 Aug 2024 5:00 PM IST
అధికారికంగా మొదలైన ప్రశాంత్ నీల్-ఎన్టీఆర్ సినిమా

ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్‌ల కాంబినేషన్ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం నేడు అధికారికంగా ప్రారంభమైంది. సినిమాకు సంబంధించిన పూజ కార్యక్రమాలను మొదలుపెట్టారు. ఈ ఈవెంట్ కు వచ్చిన ఎన్టీఆర్ దేవర లుక్‌ లో కనిపించారు. ఈ వేడుకకు టీమ్‌తో పాటు ఎన్టీఆర్ సోదరుడు కళ్యాణ్ రామ్ కూడా హాజరయ్యారు. ఈ చిత్రానికి టైటిల్ ఇంకా అనౌన్స్ చేయలేదు.

ప్రశాంత్ నీల్- ఎన్టీఆర్ కాంబినేషన్ లో సినిమాను చాలా కాలం క్రితమే అనౌన్స్ చేశారు. ఎన్టీఆర్ రగ్డ్ లుక్‌లో పోస్టర్‌ లో కనిపించారు. ప్రశాంత్ నీల్ బ్లాక్ బస్టర్ KGF సిరీస్, సాలార్ సినిమాలతో టాప్ డైరెక్టర్ గా నిలిచాడు. ఎన్టీఆర్‌తో సినిమా ప్రారంభిస్తాడని అభిమానులు, ప్రేక్షకులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్ హోమ్ బ్యానర్ అయిన ఎన్టీఆర్ ఆర్ట్స్‌తో కలిసి మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఈ చిత్రంలో కథానాయిక ఎవరన్నది ఇంకా ప్రకటించలేదు. ఈ చిత్రం సంక్రాంతి బొనాంజాగా 2026 జనవరి 9న విడుదల కానుంది. ఎన్టీఆర్ కూడా దేవర, వార్ సినిమాలను పూర్తి చేసే పనిలో బిజీ ఉన్నారు. దేవర సెప్టెంబర్ 27న విడుదల అవుతూ ఉంది. వార్ 2 వచ్చే ఏడాది విడుదల కానుంది.

Next Story