ప్రకాష్‌ రాజ్‌ నాకు మంచి మిత్రుడు: పవన్‌ కల్యాణ్‌

తిరుమల లడ్డూ వివాదంపై నటుడు ప్రకాష్‌ రాజ్‌ ట్వీట్స్‌ పరంపర కొనసాగుతూనే ఉంది.

By అంజి
Published on : 27 Sept 2024 10:48 AM IST

Prakash Raj, AP Deputy CM , Pawan Kalyan, APnews

ప్రకాష్‌ రాజ్‌ నాకు మంచి మిత్రుడు: పవన్‌ కల్యాణ్‌

తిరుమల లడ్డూ వివాదంపై నటుడు ప్రకాష్‌ రాజ్‌ ట్వీట్స్‌ పరంపర కొనసాగుతూనే ఉంది. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం వివాదంపై తన కామెంట్‌ను డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ తప్పుగా అర్థం చేసుకున్నారని ప్రకాష్‌ రాజ్‌పెట్టిన పోస్టు పెట్టిన విషయం తెలిసిందే. దీనిపై పవన్‌ కల్యాణ్‌ స్పందించారు.

''ప్రకాష్‌ రాజ్‌ నాకు మంచి మిత్రుడు. రాజకీయంగా మాకు భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ ఒకరిపట్ల ఒకరికి ఎంతో గౌరవం ఉంది. భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. దోషులకు శిక్షపడాలని నేను ట్వీట్‌ పెట్టినప్పుడు ఆయన ఆ విధంగా కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఆయన పోస్టు నేను తప్పుగా అర్థం చేసుకోలేదు. ఆయన ఉద్దేశం నాకు అర్థమైంది'' అని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

తాజాగా ఏపీలోని పరిస్థితులపై నటుడు ప్రకాష్‌ రాజ్‌ మరో ట్వీట్‌ చేశారు. ''మనకేం కావాలి.. ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టి తద్వారా రాజకీయ లబ్ధి సాధించడమా? లేక ప్రజల మనోభావాలు గాయపడకుండా పరిపాలనా సంబంధమైన అవసరమైతే తీవ్రమైన చర్యలతో సున్నితంగా సమస్యను పరిష్కరించుకోవడమా? జస్ట్ ఆస్కింగ్‌'' అని ట్వీట్‌ చేశారు.

Next Story