చార్మి తొమ్మిది నెల‌ల‌ బిడ్డ‌తో ప్ర‌భాస్‌.. ఫోటో వైర‌ల్‌

Prabhas With Charmi Dog. నిర్మాత‌గా మారిన త‌రువాత న‌టి చార్మి సోష‌ల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అంద‌రికి

By Medi Samrat  Published on  11 Nov 2020 9:15 AM GMT
చార్మి తొమ్మిది నెల‌ల‌ బిడ్డ‌తో ప్ర‌భాస్‌.. ఫోటో వైర‌ల్‌

నిర్మాత‌గా మారిన త‌రువాత న‌టి చార్మి సోష‌ల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అంద‌రికి తెలిసిందే. తాజాగా చార్మి షేర్ చేసిన ఫోటో నెటింట్లో వైర‌ల్ అవుతోంది. ఈ ఫోటోలో ప్రభాస్‌తోపాటు ఛార్మి పెంపుడు కుక్క పిల్ల ఉంది. 'నా తొమ్మిది నెలల బేబీ బాయ్ ‌(కుక్కతో) డార్లింగ్‌ ప్రభాస్'‌ అంటూ కామెంట్ చేసింది. ఈ ఫోటోలో ప్ర‌భాస్ లుక్‌ని చూసి అభిమానులు అదిరిపోయే కామెంట్లు చేస్తున్నారు. అది సింహాయో కాదో ఏయోకానీ వెన‌కాల ఉన్న‌ది మాత్రం నిజ‌మైన సింహమ‌ని డార్లింగ్ ప్ర‌భాస్‌పై ప్రేమ‌ను కురిపిస్తున్నారు. డార్లింగ్‌ ఫోటో షేర్‌ చేసినందుకు ఛార్మీకి ధన్యవాదాలు తెలుపుతున్నారు.

ఇక ఆ కుక్క వయస్సు తొమ్మిది నెలలే అయినప్పటికీ చూడటానికి చాలా పెద్దదిగా కనిపిస్తుంది. ఇది అలాస్కస్‌ మాలమ్యూట్‌ జాతికి చెందినది. ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట్లో వైర‌ల్‌గా మారింది. ప్ర‌స్తుతం ప్ర‌భాస్‌ 'రాధే శ్యామ్' చిత్రంలో న‌టిస్తున్నాడు. ఇది కాక.. మ‌రో రెండు చిత్రాల్లో న‌టించేందుకు అంగీక‌రించాడు డార్లింగ్‌. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ పూరీ ఆఫీస్‌కు వెళ్ల‌డం.. చార్మీ పోటో తీసి పూరీ క‌నెక్ట్స్ అని పంచుకోవ‌డంతో ఆస‌క్తి రేకెత్తిస్తోంది.

ఇక పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌భాస్ ఓ సినిమా చేయ‌బోతున్న‌ట్లు ఆ మ‌ధ్య వార్త‌లొచ్చాయి. అయితే దీనిపై ఎలాంటి ప్ర‌క‌ట‌న రాలేదు. ప్ర‌స్తుతం ప్ర‌భాస్‌తో పూరీ క‌థా చ‌ర్చ‌లు జ‌రిపిన‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఒక‌వేళ అదే నిజ‌మైతే అంత‌కంటే కావాల్సింది ఏమీ ఉంటుంద‌ని అంటున్నారు ప్ర‌భాస్ అభిమానులు. ఇందులో నిజ‌మెంతో తెలియాలంటే.. ప్ర‌భాస్ గానీ, పూరీ గానీ స్పందిస్తే గానీ తెలియ‌దు. ఇక వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో ఇప్ప‌టికే 'ఏక్ నిరంజ‌న్'‌, 'బుజ్జిగాడు' చిత్రాలు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఛార్మి, ప్రభాస్ క‌లిసి 'చక్రం', 'పౌర్ణమి' సినిమాల్లో నటించారు.
Next Story