సలార్-2 రూమర్లపై స్పందించిన ప్రభాస్ టీమ్

కేజీఎఫ్, సలార్ సినిమాల దర్శకుడు ప్రశాంత్ నీల్ వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్నారు. పలువురు స్టార్ హీరోలతో సినిమాలు చేయాలని ప్రశాంత్ నీల్ అనుకుంటూ వస్తున్నాడు

By Medi Samrat  Published on  6 May 2024 7:09 PM IST
సలార్-2 రూమర్లపై స్పందించిన ప్రభాస్ టీమ్

కేజీఎఫ్, సలార్ సినిమాల దర్శకుడు ప్రశాంత్ నీల్ వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్నారు. పలువురు స్టార్ హీరోలతో సినిమాలు చేయాలని ప్రశాంత్ నీల్ అనుకుంటూ వస్తున్నాడు. సలార్ తర్వాత ఎన్టీఆర్ తో వర్క్ చేయాలని భావిస్తూ ఉన్నాడు. ఇప్పటికే ఎన్టీఆర్ తో సినిమా కూడా ప్రకటించాడు. ఎన్టీఆర్ తో సినిమా కోసం సలార్ 2 ను ప్రశాంత్ నీల్‌ వాయిదా వేస్తున్నారని పుకార్లు వచ్చాయి. ఈ పుకార్లను ప్రభాస్ పీఆర్ టీమ్ ఖండించింది. ప్రశాంత్ నీల్‌తో తన చిత్రాన్ని ఆయన పుట్టినరోజున ప్రకటిస్తారని ఎన్టీఆర్ సన్నిహిత వర్గాలు సూచించాయి. ఎన్టీఆర్ ప్రస్తుతం తన పాన్ ఇండియా చిత్రం దేవర కోసం బిజీగా ఉన్నారు. సినిమా షూటింగ్ కూడా చివరి దశలో ఉంది. ఆ తర్వాత హృతిక్ రోషన్‌తో కలిసి వార్ 2తో బాలీవుడ్‌లోకి కూడా అడుగుపెడుతున్నాడు. ఎన్టీఆర్ తన సినిమాని ప్రశాంత్ నీల్ తో కూడా స్టార్ట్ చేయాలనుకుంటున్నాడని రూమర్స్ వినిపిస్తున్నాయి.

సలార్ 2 షూటింగ్ ఈ మే నెలాఖరు నుంచి ప్రారంభం కానుంది. సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర యూనిట్ చాలా ప్రణాళికలను రచిస్తూ ఉంది. త్వరలోనే చిత్ర షూటింగ్‌ను ప్రారంభించనుంది చిత్రబృందం. ఇక సలార్-2 తర్వాతనే ప్రశాంత్ నీల్ మరో సినిమాకు కమిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. సలార్, కేజీఎఫ్ లను మించేలా యాక్షన్ సీక్వెన్స్ సలార్-2 లో ఉండబోతున్నాయి.

Next Story