ప్రభాస్ కొత్త సినిమా హీరోయిన్ ఎవరో సస్పెన్స్ వీడింది..!
By Medi Samrat Published on 17 Aug 2024 2:42 PM ISTప్రభాస్ బ్యాక్-టు-బ్యాక్ ప్రాజెక్ట్‌లు చేస్తూ ఉన్నాడు. కల్కి సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న ప్రభాస్.. ఇప్పుడు 'రాజాసాబ్' సినిమాలో పని చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ప్రభాస్ “సీతా రామం” హిట్ తో స్టార్ డైరెక్టర్ గా మారిన హను రాఘవపూడి దర్శకత్వంలో కొత్త సినిమా చేయబోతున్నారు. ఈ కొత్త ప్రాజెక్ట్ శనివారం హైదరాబాద్‌లో సాంప్రదాయ పూజా వేడుకలతో అధికారికంగా ప్రారంభించారు. ఈ ఈవెంట్‌లో ప్రభాస్ పాల్గొన్నారు.
ఆసక్తికరమైన విషయమేమిటంటే.. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అనే విషయమై చాలా చర్చ జరిగింది. మొదట మృణాల్ ఠాకూర్ పేరు కూడా వినిపించింది. అయితే ఇమాన్ ఎస్మాయిల్ అనే అమ్మాయి ఈ చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టనుంది. లాంచ్ ఈవెంట్‌లో ఆమె అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రభాస్‌కు ఇమాన్ సరిగ్గా సరిపోతుందంటూ ఆమెను సోషల్ మీడియాలో ఫాలో అవ్వడం మొదలు పెట్టేశారు ప్రభాస్ ఫ్యాన్స్. పూజకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ సినిమా షూటింగ్ సెప్టెంబర్ మూడో వారంలో ప్రారంభం కానుందని సమాచారం. మిగిలిన నటీనటులు, సాంకేతిక సిబ్బంది వివరాలు బయటకు రావాల్సి ఉంది.