ప్రభాస్ 'కల్కి'.. ఈ వీకెండ్ కలెక్షన్స్ ఆ రేంజిలో ఉండబోతున్నాయా.?
'కల్కి 2898 AD' గ్రాండ్ గా రిలీజ్ అయింది. ఈ చిత్రం అడ్వాన్స్ బుకింగ్స్ అద్భుతమైన వ్యాపారాన్ని చేసింది.
By Medi Samrat Published on 27 Jun 2024 1:45 PM IST'కల్కి 2898 AD' గ్రాండ్ గా రిలీజ్ అయింది. ఈ చిత్రం అడ్వాన్స్ బుకింగ్స్ అద్భుతమైన వ్యాపారాన్ని చేసింది. భారతదేశంలోనే రూ. 150 కోట్లకు పైగా గ్రాస్‌ను వసూలు చేస్తుంది. 1వ రోజు ప్రభాస్ నటించిన చిత్రం గ్రాస్ వసూళ్లు 120-180 కోట్ల రేంజ్‌లో ఉండవచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో మొదటి వీకెండ్ అద్భుతమైన వసూళ్లు కల్కి సాధించే అవకాశం ఉంది.
'సాలార్ - పార్ట్ I', 'RRR', 'KGF 2' విడుదల సమయంలో థియేటర్‌లలో కనిపించిన ధోరణి తాజాగా కనిపించింది. ప్రస్తుతానికి, 'కల్కి 2898 AD' మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద 'ఆదిపురుష్', 'సాహో'తో సహా ప్రభాస్ పలు చిత్రాలను బీట్ చేయడానికి సిద్ధంగా ఉంది. అయితే 'బాహుబలి 2' రికార్డును బద్దలు కొడుతుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది.
భారతదేశంలో ప్రారంభ రోజు టాప్ అడ్వాన్స్ లో రికార్డులు
బాహుబలి 2: రూ. 100+ కోట్లు
కేజీఎఫ్ 2: రూ. 80.3 కోట్లు
RRR: రూ. 58.73 కోట్లు
సాలార్: రూ. 48.94 కోట్లు
సాహో: రూ. 35 కోట్లు
ఆదిపురుష్: రూ. 26.39 కోట్లు
దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ ప్రత్యేక పాత్రలలో నటించిన ఈ చిత్రం వారాంతంలో 500 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను రాబట్టవచ్చు. మొదటి రోజు దాదాపు రూ. 180-200 కోట్ల గ్రాస్ వసూలు చేస్తుందని అంచనా. సినిమా గురువారం విడుదలవ్వడం, శని, ఆదివారాల్లో కూడా మంచి బిజినెస్ జరిగి ఉండడం ఈ సినిమాకు కలిసొచ్చే అంశం. బాక్సాఫీస్ వద్ద ఆదివారం కంటే ముందే ప్రపంచ వ్యాప్తంగా 'కల్కి' రూ.500 కోట్ల బెంచ్‌మార్క్‌ను దాటినా ఆశ్చర్యపోనవసరం లేదు.