కృష్ణంరాజు అంటే ప్రభాస్ కి ఎంత ప్రేమో తెలుసా.?

Prabhas Adjusting Krishnam Raju Hair. ఇండస్ట్రీలో రెబల్ స్టార్ గా పేరు సంపాదించుకున్న కృష్ణంరాజు.. తన వారసుడిగా తెలుగు ఇండస్ట్రీలోకి యంగ్ రెబల్ స్టార్ గా ప్రభాస్ ను వెండితెరకు పరిచయం చేశాడు

By Medi Samrat  Published on  21 Jan 2021 6:34 PM IST
Prabhas Adjusting Krishnam Raju Hair
ఇండస్ట్రీలో రెబల్ స్టార్ గా పేరు సంపాదించుకున్న కృష్ణంరాజు.. తన వారసుడిగా తెలుగు ఇండస్ట్రీలోకి యంగ్ రెబల్ స్టార్ గా ప్రభాస్ ను వెండితెరకు పరిచయం చేశాడు. తాను నటించిన సినిమాలన్నీ మంచి విజయాలను అందుకోవడంతో.. ప్రస్తుతం ప్ర‌భాస్‌ పాన్ ఇండియా హీరోగా గుర్తింపును సంపాదించుకున్నాడు. సినీ ఇండస్ట్రీలో ఉన్నత స్థాయిలో పేరు సంపాదించుకున్న కొడుకును చూసి తల్లిదండ్రులు ఎంతో గర్వ పడుతుంటారు. కానీ కొడుకు ఎంత ఎదిగిన తండ్రి చాటు బిడ్డ అని ఎన్నోసార్లు ఋజువైంది. ప్రస్తుతం కృష్ణంరాజు బుధవారం తన 81వ పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్నారు. దీంతో ప్రభాస్ అభిమానులతో పాటు, పలువురు సినీ సెలబ్రిటీలు కృష్ణంరాజు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలను పెద్ద ఎత్తున తెలియజేశారు.


కృష్ణంరాజు పుట్టినరోజు సందర్భంగా గతేడాది జరిగిన పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియోలో కృష్ణంరాజు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ జుట్టును సరి చేస్తూ కనిపిస్తాడు. ఆ క్షణంలో అతని ప్రేమకు ముగ్ధుడైన ప్రభాస్ అలాగే తన పెదనాన్న వైపు చూస్తూ ఉండి పోయాడు. ప్రస్తుతం ఈ సన్నివేశం ప్రభాస్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది.

గత ఏడాది కృష్ణంరాజు పుట్టినరోజు సందర్భంగా డైలాగ్ కింగ్ మోహన్ బాబు, మెగాస్టార్ చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. ఆ వేడుకల్లో కృష్ణంరాజు సొంత కొడుకులా భావించే ప్రభాస్ కు కేక్ తినిపిస్తున్న ఫోటోలను, తన కుటుంబంతో కలిసి దిగిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ తండ్రి కొడుకులు ఇద్దరూ కలిసి "రెబల్", "బిల్లా" సినిమాలో నటించిన సంగతి మనకు తెలిసిందే. అయితే ప్రస్తుతం ప్రభాస్ రాధాకృష్ణ డైరెక్షన్ లో "రాధేశ్యామ్ "చిత్రంలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇవే కాకుండా మరికొన్ని సినిమాలతో ప్రభాస్ బిజీగా గడుపుతున్నారు.


Next Story