ఆసుప‌త్రిలో పూన‌మ్ పాండే.. భర్త సామ్ బాంబే అరెస్టు

Poonam Pandey husband arrested for assault. నటి పూనమ్ పాండే భర్త సామ్ బాంబేను ముంబై పోలీసులు అరెస్టు చేశారు. పూనమ్‌పై దాడి చేసిన

By Medi Samrat  Published on  9 Nov 2021 9:42 AM IST
ఆసుప‌త్రిలో పూన‌మ్ పాండే.. భర్త సామ్ బాంబే అరెస్టు

నటి పూనమ్ పాండే భర్త సామ్ బాంబేను ముంబై పోలీసులు అరెస్టు చేశారు. పూనమ్‌పై దాడి చేసిన నేఫ‌థ్యంలో ఆమె ఫిర్యాదు మేర‌కు సామ్ బాంబేను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పూనమ్ తల, కళ్ళు, ముఖంపై గాయాలయ్యాయి. ఆమె గాయాల‌తో ఆసుపత్రిలో చేరినట్లు పోలీసులు తెలిపారు. భారత శిక్షాస్మృతిలోని ప‌లు సెక్షన్ల కింద సామ్ బాంబేపై కేసు నమోదు చేయబడిందని ముంబై పోలీసులు తెలిపారు.

గత సంవత్సరం పెళ్లైన కొన్ని రోజులకే సామ్ బాంబే, పూనమ్ పై దాడి చేసినందుకు అరెస్టయ్యాడు. వీరిద్దరూ గోవాలో హనీమూన్‌లో ఉండ‌గా.. పూనమ్ గృహహింస కేసు పెట్టింది. కొద్దిరోజుల‌కు సామ్ బాంబే కు బెయిల్ రావ‌డంతో పూనమ్ తిరిగి అత‌నితో జీవ‌నం కొన‌సాగించింది. వివాహ బంధంలో ఇలాంటివి స‌హ‌జం అని కూడా తెలిపింది. ఇదిలావుంటే.. రెండేళ్లు లైవ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్న పూనమ్, సామ్ జంట 2020 సెప్టెంబర్ 1న బాంద్రాలోని వారి ఇంటిలో వివాహం చేసుకున్నారు.

ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడిన‌ పూనమ్.. గ‌తంలో సామ్‌పై పెట్టిన‌ కేసును ఉపసంహరించుకుంటానని పేర్కొంది. సామ్ కార‌ణంగా తీవ్రంగా గాయాల‌య్యాయి. అది హాప్ మ‌ర్డ‌ర్‌. నేను ఎన్ని రోజులు ఆసుపత్రిలో ఉన్నానో నాకే తెలియదని వాపోయింది. అయితే.. సామ్ త‌న‌ ముందు క‌న్నీరుపెట్టాడ‌ని చెప్పుకొచ్చింది. ఎన్నోసార్లు కొట్ట‌డం.. ఆపై క్ష‌మించ‌మ‌ని ప్రాధేయ‌ప‌డ‌టం చేసేవాడ‌ని.. అప్పుడు కూడా అలాగే చేసాడని.. ఇకపై అలా జరగదు.. మంచిగా వ్యవహరిస్తానని వాగ్దానం చేశాడని.. అయితే ఇలా చేయ‌డం అత‌నికి స‌ర్వ‌సాధార‌మైంద‌ని.. అతని వల్ల నాకు బ్రెయిన్ హెమరేజ్ వచ్చిందని పూనమ్ ఇంట‌ర్వ్యూలో చెప్పింది.


Next Story