చట్టాలు చూస్తే.. పూనమ్ పాండేకు ఎలాంటి శిక్ష విధించే అవకాశం ఉందంటే..?

నటి పూనమ్‌ పాండే చనిపోయిందంటూ శుక్రవారం ఒక వార్త వచ్చింది. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ పేజ్‌లో ఒక నోట్‌ కూడా కనిపించడంతో

By Medi Samrat  Published on  3 Feb 2024 2:44 PM IST
చట్టాలు చూస్తే.. పూనమ్ పాండేకు ఎలాంటి శిక్ష విధించే అవకాశం ఉందంటే..?

నటి పూనమ్‌ పాండే చనిపోయిందంటూ శుక్రవారం ఒక వార్త వచ్చింది. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ పేజ్‌లో ఒక నోట్‌ కూడా కనిపించడంతో నిజంగానే పూనమ్‌ పాండే చనిపోయిందని భావించారు కొందరు. కొందరు మాత్రం ఆమె డెడ్‌బాడీ ఎక్కడా కనిపించడం లేదనీ అనుమానం వ్యక్తం చేశారు. తాజాగా తాను బతికే ఉన్నానంటూ సోషల్‌ మీడియాలో ఒక వీడియో విడుదల చేసింది. తనకు ఎలాంటి క్యాన్సర్ లేదని.. సర్వైకల్‌ క్యాన్సర్ గురించి అవగాహన కల్పించడం కోసం తాను చనిపోయినట్లు వార్తలు సృష్టించినట్లు తెలిపింది.

అయితే నకిలీ వార్తలను వ్యాప్తి చేసినందుకు పూనమ్ జైలు శిక్ష అనుభవించే అవకాశం లేకపోలేదు. ఆమెకు జరిమానా కూడా విధించవచ్చు. ఐటీ చట్టం-2000లోని సెక్షన్ 67 ప్రకారం, ఎవరైనా మొదటిసారి సోషల్ మీడియాలో పుకార్లు వ్యాప్తి చేసినందుకు దోషిగా తేలితే, అతనికి మూడేళ్ల జైలు శిక్ష విధించబడుతుంది. అలాగే రూ.5 లక్షల వరకు జరిమానా చెల్లించాల్సి రావచ్చు. నేరం పునరావృతమైతే నేరస్థుడు 5 సంవత్సరాల జైలు, 10 లక్షల రూపాయల వరకు జరిమానా చెల్లించవలసి ఉంటుంది. తప్పుడు వార్తలను ప్రచారం చేసిన పూనమ్ పాండేను అరెస్టు చేయాలంటూ పలువురు సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తున్నారు.

Next Story