గుంటూరు కారం రిలీజ్ ముందు.. త్రివిక్రమ్ పై పూనమ్ ఫైర్

సంక్రాంతికి విడుదల అవుతున్న సినిమాలలో త్రివిక్రమ్-మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న 'గుంటూరు కారం' సినిమాకు మంచి బజ్ ఉంది.

By Medi Samrat  Published on  5 Jan 2024 6:45 PM IST
గుంటూరు కారం రిలీజ్ ముందు.. త్రివిక్రమ్ పై పూనమ్ ఫైర్

సంక్రాంతికి విడుదల అవుతున్న సినిమాలలో త్రివిక్రమ్-మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న 'గుంటూరు కారం' సినిమాకు మంచి బజ్ ఉంది. ఈ సినిమాను భారీగా విడుదల చేయాలని ఆ సినిమా నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో నటి పూనమ్ కౌర్ త్రివిక్రమ్ పై విమర్శలు గుప్పించింది.

గుంటూరు కారం సినిమా రిలీజ్ అవుతూ ఉండగా.. ఆ సినిమా మీద కాపీ ఆరోపణలు వచ్చాయి. ఈ చిత్రం స్టోరీ లైన్ ప్రముఖ రచయిత్రి యద్దనపూడి సులోచన రాణి రాసిన 'కీర్తి కిరీటాలు' అనే నవల నుంచి కాపీ కొట్టినట్లు వార్తలు వైరల్ గా మారాయి. “ఆయన ఏదైనా చేయగల సమర్థుడు. దాన్నుంచి ఎలా తప్పించుకోవాలో కూడా ఆయనకు బాగా తెలుసు. తన తప్పుడు పనులను ప్రజలకు కనబడకుండా జాగ్రత్తపడే నైపుణ్యం ఉన్నవాడు. కొందరు గుడ్డిగా ఆయనను నమ్మేస్తారు. ప్రజల సమస్యలు తీర్చడానికి ముందుకు రాని గత ప్రభుత్వం ఆయనకు మాత్రం బాగా సాయం చేసింది. అదెందుకో నాకిప్పటికీ అర్థం కాదు మరి” అంటూ ట్వీట్ చేశారు. దానికి గురూజీ థింగ్స్ అని కూడా లాస్ట్ లో మెసేజీ పెట్టింది. ఇక ఆయనకు సీఎం కార్యాలయానికి ప్రత్యేక ప్రవేశం కూడా ఉంటుందని ట్వీట్ చేసింది. మరోసారి పూనమ్ త్రివిక్రమ్ ను టార్గెట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది.

Next Story