కరోనాను జయించిన పూజా హెగ్డే

Pooja Hegde tests negative for COVID-19.గత కొద్దిరోజులుగా హోమ్ ఐసోలేషన్ లో ఉన్న పూజా హెగ్డేకు తాజాగా కరోనా నెగటివ్ వచ్చింది.

By Medi Samrat  Published on  5 May 2021 11:01 AM GMT
Pooja Hegde

కరోనా బారిన పలువురు సెలెబ్రిటీలు పడిన సంగతి తెలిసిందే..! టాలీవుడ్ భామ పూజా హెగ్డే కూడా కరోనా బారిన పడింది. గత కొద్దిరోజులుగా హోమ్ ఐసోలేషన్ లో ఉన్న పూజా హెగ్డేకు తాజాగా కరోనా నెగటివ్ వచ్చింది.

గత వారంలో తనకు కరోనా వచ్చిన విషయాన్ని పూజా హెగ్డే ప్రకటించింది. తనకు స్వల్ప లక్షణాలు కనిపించాయని, పరీక్షించుకుంటే కరోనా పాజిటివ్ అని తేలిందంటూ పూజా హెగ్డే తెలిపింది. తనను కలిసిన వారంతా కూడా పరీక్షలు చేయించుకోవాలని పూజా హెగ్డే కోరింది. అలా తాను క్వారంటైన్‌లోకి వెళ్లిపోయానని పూజా హెగ్డే తెలిపింది. క్వారంటైన్‌లో ఉన్న పూజా తనకు తోచిన పనులు చేసింది. పూజా హెగ్డే కోలుకోవాలని అభిమానులు కూడా ఆకాంక్షించారు. పూజా హెగ్డే తగినంత కేర్ తీసుకుని.. క్వారంటైన్ లో ఉండి కరోనా మహమ్మారిని జయించింది. ఈ విషయాన్ని పూజా తన సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా చెప్పుకొచ్చింది.

'నా కోసం మీరు పంపిన ప్రేమకు ఎంతో ధన్యవాదాలు.. నేను రికవర్ అయ్యాను.. కరోనా మహమ్మారిని జయించాను.. నెగటివ్ వచ్చింది. మీరు నాపై చూపించిన అభిమానమే కరోనాను జయించగలిగే శక్తిని ఇచ్చింది' అని పూజా హెగ్డే చెప్పుకొచ్చింది. తెల్లటి డ్రెస్ లో నవ్వుతూ ఉన్న ఫోటోను కూడా పూజా హెగ్డే పోస్టు చేసింది.

పూజా హెగ్డే దక్షిణాది సినిమాలతో పాటూ బాలీవుడ్ సినిమాల్లో కూడా నటిస్తూ ఉంది. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ అంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పింది. కరోనా ప్రభావం లేకపోతే ఈ ఏడాది ఈద్ కు సల్మాన్ తో తాను కలిసి నటించిన 'కభీ ఈద్ కభీ దివాలి' సినిమా రిలీజ్ అయ్యేదని పేర్కొంది. సెట్స్ లో ఉన్నప్పుడు సల్మాన్ తో తాను ఎన్నో విషయాలు మాట్లాడాలనుకున్నానని, ఆయనతో మాట్లాడాల్సిన విషయాలు చాలా ఉన్నాయని పూజా చెప్పుకొచ్చింది. పూజా బాలీవుడ్ లో మరో చిత్రాన్ని కూడా చేస్తోంది. రణవీర్ సింగ్ సరసన 'సర్కస్' చిత్రంలో ఆమె నటిస్తోంది.


Next Story
Share it