ఎవరీ 'రోహన్ మెహ్రా'.. పూజా హెగ్డే కు ఏమవుతాడు.?

పాన్-ఇండియన్ నటి పూజా హెగ్డే.. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి చాలా విషయాలను సీక్రెట్ గా ఉంచుతూ ఉంటుంది.

By Medi Samrat  Published on  1 April 2024 4:51 AM GMT
ఎవరీ రోహన్ మెహ్రా.. పూజా హెగ్డే కు ఏమవుతాడు.?

పాన్-ఇండియన్ నటి పూజా హెగ్డే.. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి చాలా విషయాలను సీక్రెట్ గా ఉంచుతూ ఉంటుంది. ఆమె బాయ్ ఫ్రెండ్ ఎవరా అనే విషయం ఇప్పటి వరకూ బయట పడలేదు. తన లవ్ లైఫ్ గురించి కూడా బుట్టబొమ్మ ఎక్కడా కూడా చెప్పినట్లు కనిపించలేదు. తాజాగా ఆమె ఓ వ్యక్తితో తిరుగుతూ ఉండడాన్ని బాలీవుడ్ మీడియా ప్రముఖంగా ప్రచురించింది. రోహన్ మెహ్రాతో పూజా హెగ్డే కనిపించింది. ముంబైలోని బాంద్రాలో ఇద్దరినీ ఫోటో తీశారు. పూజా, రోహన్ కూడా ఒకే కారులో కలిసి కనిపించారు. పూజ బూడిదరంగు ప్యాంటు, నలుపు బూట్లు, తెల్లటి చొక్కా ధరించి కనిపించింది. రోహన్ నలుపు టీ-షర్టు, నేవీ బ్లూ ప్యాంట్, నలుపు టోపీ, తెల్లటి స్నీకర్లతో క్యాజువల్‌గా కనిపించాడు. రోహన్ మెహ్రా బుట్టబొమ్మ బాయ్ ఫ్రెండ్ అంటూ ప్రచారం చేస్తున్నారు.

రోహన్ మెహ్రా దివంగత నటుడు వినోద్ మెహ్రా కుమారుడు. రోహన్ 2018లో సైఫ్ అలీ ఖాన్‌తో కలిసి నటించిన 'బజార్'తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. రోహన్ ఇంతకుముందు స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 స్టార్ తారా సుతారియాతో రిలేషన్ షిప్ లో ఉన్నాడనే వార్తలు వచ్చాయి. మే 2019లో వీరిద్దరికీ బ్రేకప్ అయిందనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. 2023లో, పూజా ముంబైకి చెందిన క్రికెటర్‌తో డేటింగ్‌లో ఉందని త్వరలోనే అతనితో పెళ్లి చేసుకోనుందని పలు నివేదికలు రాగా.. ఆ పుకార్లను పూజ హెగ్డే కొట్టివేసింది. ఇప్పుడు రోహన్ మెహ్రా గురించి పూజ హెగ్డే ఏమని స్పందిస్తుందో చూడాలి. పూజ చివరిసారిగా సల్మాన్ ఖాన్‌తో కలిసి 'కిసీ కా భాయ్ కిసీ కి జాన్'లో కనిపించింది. ఫర్హాద్ సామ్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వెంకటేష్ దగ్గుబాటి, జగపతి బాబు, భూమికా చావ్లా కీలక పాత్రలు పోషించారు. ఆ తర్వాత ఆమె 'దేవా'లో కనిపించనుంది. షాహిద్ కపూర్ సరసన నటి నటిస్తోంది. ఈ ఏడాది అక్టోబర్‌లో దసరా సందర్భంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. అహాన్ శెట్టి సరసన పూజ 'సంకీ' సినిమాలో కూడా నటిస్తోంది.

Next Story