పొన్నియిన్ సెల్వన్ కు తెలుగులో హైప్ తీసుకుని వచ్చేది ఎవరో..?

Ponniyin Selvan Part 2 will release 6 to 9 months after part 1's release. మణిరత్నం భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్న 'పొన్నియిన్ సెల్వన్' సినిమా విడుదల కోసం

By Medi Samrat  Published on  17 Sept 2022 9:00 PM IST
పొన్నియిన్ సెల్వన్ కు తెలుగులో హైప్ తీసుకుని వచ్చేది ఎవరో..?

మణిరత్నం భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్న 'పొన్నియిన్ సెల్వన్' సినిమా విడుదల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 2022లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ఇది ఒకటి. ఈ సినిమా సిరీస్ లో మొదటి భాగం సెప్టెంబర్ 30న గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధమైంది. చెన్నైలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దర్శకుడు మణిరత్నం రెండవ భాగం గురించి వెల్లడించారు. చిత్రం రెండో భాగం మరికొద్ది నెలల్లో థియేటర్లలోకి రానుందని చెప్పుకొచ్చారు.

సెప్టెంబర్ 17న చెన్నైలో జరిగిన పొన్నియిన్ సెల్వన్ పాత్రికేయుల సమావేశంలో, మణిరత్నంను సినిమా రెండవ భాగం, దాని విడుదల తేదీ గురించి అడిగారు. పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 2.. మొదటి భాగం విడుదలైన 6 నుండి 9 నెలల తర్వాత విడుదల అవుతుందని మణిరత్నం సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం చిత్ర నిర్మాతలు విడుదలకు ముందు ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. పొన్నియిన్ సెల్వన్ యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు 125 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయని తెలుస్తోంది. శాటిలైట్ రైట్స్ సన్ టీవీ భారీ ధరకు తెచ్చుకుంది.

సినిమా గ్రాండ్ రిలీజ్ కు వారం రోజుల ముందు ఆడియో, ట్రైలర్ లాంచ్ ను సన్ నెట్వర్క్ లో ప్రసారం చేయనున్నారు. ఇటీవలే చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో పొన్నియిన్ సెల్వన్ ట్రైలర్, ఆడియో విడుదల కార్యక్రమం జరిగింది. కమల్ హాసన్, రజనీకాంత్ ముఖ్య అతిథులుగా లాంచ్‌కి హాజరయ్యారు. ఇక ఈ సినిమాను తెలుగులో కూడా రిలీజ్ చేయాలని అనుకుంటూ ఉన్నారు. అయితే సినిమాకు ఏ మాత్రం హైప్ లేకుండా పోయింది. తెలుగు సినిమా ప్రమోషన్స్ ను అసలు పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి.


Next Story