సల్మాన్ ఖాన్ కారులో ఉండగానే చంపేయాలని ప్లాన్.. 20-25 మంది బ్యాచ్‌తో..

జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌ను మహారాష్ట్రలోని పన్వెల్‌లోని ఆయ‌న‌ ఫామ్‌హౌస్ సమీపంలో అతని కారును ఆపి

By Medi Samrat  Published on  1 Jun 2024 6:45 PM IST
సల్మాన్ ఖాన్ కారులో ఉండగానే చంపేయాలని ప్లాన్.. 20-25 మంది బ్యాచ్‌తో..

జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌ను మహారాష్ట్రలోని పన్వెల్‌లోని ఆయ‌న‌ ఫామ్‌హౌస్ సమీపంలో అతని కారును ఆపి, AK-47 రైఫిల్స్‌తో కాల్చి చంపాలని ప్లాన్ చేసినట్లు వర్గాలు తెలిపాయి. దీనికి సంబంధించి బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన నలుగురు షూటర్లను పన్వేల్ పోలీసులు అరెస్టు చేశారు. షూటర్లను ధనంజయ్ తాప్సింగ్ అలియాస్ అజయ్ కశ్యప్‌, గౌరవ్ భాటియా అలియాస్ నహ్వీ, వాస్పీ ఖాన్ అలియాస్ వసీం చిక్నా, రిజ్వాన్ ఖాన్ అలియాస్ జావేద్ ఖాన్ లుగా గుర్తించారు.

నవీ ముంబై సర్కిల్ డీసీపీ వివేక్ పన్సారే మాట్లాడుతూ.. నలుగురు వ్యక్తులు సల్మాన్ ఖాన్ ఫామ్‌హౌస్‌తో పాటు బాంద్రాలోని అతని ఇంటిపై ఏప్రిల్‌లో కాల్పులు జరిపారని చెప్పారు. సల్మాన్ ఖాన్ ను చంపడానికి 20-25 మంది ప్రయత్నించారని తెలిపారు. సల్మాన్ ఖాన్ ను టార్గెట్ చేయడానికి సంబంధించి అజయ్ కశ్యప్ అందరితోనూ సమన్వయం చేస్తున్నాడని గుర్తించామని తెలిపారు. అతని వద్ద ఆయుధాలకు సంబంధించిన సమాచారం కూడా ఉందని తెలిపారు. అరెస్టయిన వ్యక్తుల మొబైల్ ఫోన్‌ల నుండి సల్మాన్ ఖాన్‌పై AK-47 రైఫిల్స్‌తో పాటు ఇతర ఆయుధాలతో దాడి చేయమని సూచించిన వీడియోలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Next Story