పవన్, సాయి ధరమ్ తేజ్ సినిమాలో హీరోయిన్లు ఫిక్స్

PKSDT Movie Update. పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి తమిళ సినిమా వినోదయ సీతంను తెలుగు లోకి రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే

By Sumanth Varma k  Published on  1 March 2023 9:45 PM IST
పవన్, సాయి ధరమ్ తేజ్ సినిమాలో హీరోయిన్లు ఫిక్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కలిసి తమిళ సినిమా వినోదయ సీతంను తెలుగు లోకి రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, తాజాగా ఈ సినిమాలో నటించే హీరోయిన్ల పై క్లారిటీ వచ్చింది. యంగ్ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్, బోల్డ్ బ్యూటీ కేతిక శర్మ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే ప్రముఖ హాస్య నటుడు అలీ కూడా ఓ చిన్న పాత్రలో నటిస్తున్నాడు.

తర్వాత జరగనున్న షెడ్యూల్ లో ప్రియా ప్రకాష్ - కేతిక శర్మ షూట్ లో కూడా పాల్గొననున్నారు. ప్రముఖ నటుడు, 'శంభో శివ శంభో' సినిమా డైరెక్టర్ సముద్రఖని ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నారు. ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ మెయిన్ లీడ్ లో నటిస్తుండగా పవన్ కళ్యాణ్ ఓ గెస్ట్ అపీరెన్స్ లో కనపడనున్నారు. దర్శకుడు త్రివిక్రమ్ కూడా ఈ సినిమా స్క్రిప్ట్ లో భాగం అయ్యినట్టు కన్ఫర్మ్ అయ్యింది.

ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా అద్భుతంగా ఆకట్టుకుంది. మరి బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఏ రేంజ్ సక్సెస్ ను సాధిస్తోందో చూడాలి. నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తోంది.


Next Story