ఇక‌పై వెయిటింగ్‌లు ఉండ‌వు.. ఓన్లీ అప్‌డేట్స్ మాత్ర‌మే

యంగ్ హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ న‌టిస్తున్న విరూపాక్ష టీజ‌ర్ ను ఎప్పుడు విడుద‌ల చేస్తారు అన్న విష‌యాన్ని చిత్ర బృందం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  26 Feb 2023 2:23 PM IST
ఇక‌పై వెయిటింగ్‌లు ఉండ‌వు.. ఓన్లీ అప్‌డేట్స్ మాత్ర‌మే

సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ న‌టిస్తున్న తాజా చిత్రం "విరూపాక్ష‌". కార్తీక్ దండు ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. సుకుమార్ రైటింగ్స్‌, SVCC క‌లిసి నిర్మిస్తున్న ఈ చిత్రంలో సంయుక్త మీన‌న్ క‌థానాయిక‌. అజ‌నీష్ లోక‌నాథ్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇప్ప‌టికే ఈ చిత్రం నుంచి విడుద‌లైన ఫ‌స్ట్ గ్లింప్స్‌కి అదిరిపోయే రెస్పాన్స్ వ‌చ్చింది.

ఇక‌పై వెయిటింగ్ ఉండ‌వు. అప్డేట్స్ మాత్ర‌మే ఉంటాయి అంటూ సాయిధ‌ర‌మ్ తేజ్ ట్వీట్ చేశాడు. మార్చి 1న ఈ చిత్ర టీజ‌ర్‌ను విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ఓ ఇంట్రెస్టింగ్ మోషన్ పోస్టర్ టీజర్‌తో ఈ విష‌యాన్ని చిత్ర‌బృందం చెప్పింది. ఈ చిత్రంలో ఎలాంటి డూప్ లేకుండానే సాయి ధ‌ర‌మ్ తేజ్ రిస్కీ బైక్ స్టంట్స్ చేశారు. పాన్ ఇండియా లెవ‌ల్‌లో ఏప్రిల్ 21న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Next Story