పవన్ - సాయి తేజ్ సినిమా షూటింగ్ ఈ రోజు నుంచే !
Pawan Kalyan - Sai Tej movie shooting from today. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కలిసి
By Sumanth Varma k Published on 22 Feb 2023 1:00 PM ISTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కలిసి తమిళ సినిమా వినోదయ సీతంను తెలుగు లోకి రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నటుడు, 'శంభో శివ శంభో' సినిమా డైరెక్టర్ సముద్రఖని ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నారు. ఈ సినిమా ఈరోజు హైదరాబాదులో చిత్రీకరణ ప్రారంభించినట్టు నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ తెలిపింది. పవన్ కళ్యాణ్ - సాయి తేజ్ పై కీలక సీన్స్ ను షూట్ చేస్తున్నారు.
ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ మెయిన్ లీడ్ లో నటిస్తుండగా పవన్ కళ్యాణ్ ఓ గెస్ట్ అపీరెన్స్ లో కనపడనున్నారు. దర్శకుడు త్రివిక్రమ్ కూడా ఈ సినిమా స్క్రిప్ట్ లో భాగం అయ్యినట్టు కన్ఫర్మ్ అయ్యింది. తాజాగా వదిలిన అనౌన్సమెంట్ పోస్టర్ లో కూడా పవన్ సూపర్ స్టయిలిష్ లుక్స్ లో బాగున్నాడు. అన్నట్టు ఈ సినిమా కోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొత్తం 22 రోజులు పాటు డేట్స్ ఇచ్చాడు. ఈ 22 రోజులకు గానూ పవన్ కళ్యాణ్ మొత్తం ముప్పై ఐదు కోట్లు తీసుకున్నట్లు తెలుస్తోంది.
'THE BEST DAY' I would cherish forever.
— Sai Dharam Tej (@IamSaiDharamTej) February 22, 2023
It's a dream come true to work with my Guru for life @PawanKalyan ❤️
Grateful at this amazing opportunity & Can't wait for a big chunk of learning and memories.@thondankani @vishwaprasadtg @vivekkuchibotla @peoplemediafcy @ZeeStudios_ pic.twitter.com/q52FFy2kbk