దేశంలో కిరాయికి రాజకీయపార్టీ పెట్టిన ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్
Perni Nani Fires On Pawan Kalyan. టాలీవుడ్ నిర్మాతలు పేర్ని నానితో భేటీ అయిన విషయం తెలిసిందే. భేటీ అనంతరం
By Medi Samrat Published on 29 Sept 2021 7:31 PM ISTటాలీవుడ్ నిర్మాతలు పేర్ని నానితో భేటీ అయిన విషయం తెలిసిందే. భేటీ అనంతరం నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. చిరంజీవి, నాగార్జున, రాజమౌళితో కలిసి గతంలోనే సీఎంను కలిశామని.. పరిశ్రమపై కోవిడ్ ప్రభావం, సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లామని అన్నారు. వకీల్ సాబ్ సినిమా సమయంలో కొన్ని పరిణామాలు వేగంగా జరిగిపోయాయని.. దయచేసి అందరూ వివాదాలకు మమ్మల్ని దూరంగా ఉంచండని కోరారు. గతంలో మా విజ్ఞప్తిపై ఏపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని.. ఆన్‌లైన్ విధానం కావాలని పరిశ్రమ తరపున మేమే ప్రభుత్వాన్ని కోరామని.. ఆన్ లైన్ విధానం ద్వారా ట్రాన్స్‌ఫరెన్సీ ఉంటుందని అన్నారు. సినిమా రంగం చాలా సున్నితమైందని.. సినీ సమస్యలపై సీఎం జగన్ సానుకూలంగా ఉన్నారని అన్నారు. సినీ పరిశ్రమను రాజకీయాల్లోకి లాగొద్దని.. ఎవరో ఏదో మాట్లాడితే మాకు సంబంధం లేదని దిల్ రాజు అన్నారు.
మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.. పవన్ వ్యాఖ్యలకు మాకూ సంబంధం లేదని నిర్మాతలు స్పష్టం చేశారని అన్నారు. ఆడియో ఫంక్షన్ లో జరిగిన పరిణామాలతో ఇండస్ట్రీకి సంబంధం లేదని చిరంజీవి కూడా చెప్పారని మంత్రి తెలిపారు. ఇండస్ట్రీని బ్రతికించేందుకు ప్రభుత్వం ఇచ్చే సూచనలు, సలహాలు పాటించేందుకు సిద్ధమని చెప్పారని అన్నారు. పవన్ కల్యాణ్ కు వాళ్ల అమ్మగారు సంస్కారం నేర్పలేదా అని ప్రశ్నించారు. ఆ సన్నాసి నన్నేం తిట్టాడు.. నేను ఏం మాట్లాడాను.. నేను బూతులు తిట్టలేదు కాబట్టే.. టీవీలో నా ప్రెస్ మీట్ ప్రసారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్ర ముఖ్యమంత్రిని అరేయ్.. ఒరేయ్ అని పిలవమని అంజనాదేవి నేర్పించారా.? అని ప్రశ్నించారు. నేను రెడ్లకు పాలేరునైతే.. పవన్ కమ్మవాళ్లకు పాలేరు అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎస్.. నేను జగన్ దగ్గర పాలేరునే.. నీకు చెప్పే దమ్ముందా.! అని ఫైర్ అయ్యారు. నన్ను అవమానించాలని చూస్తే.. ఆ అవమానాన్ని పరిచయం చేస్తానని హెచ్చరించారు. దేశంలో కిరాయికి రాకీయపార్టీ పెట్టిన ఏకైక వ్యక్తి పవన్ కల్యాణ్ అని.. రాజకీయ పార్టీలకు టెంట్ హౌస్ పెట్టిన వ్యక్తి పవన్ కల్యాణ్ అని తీవ్రవిమర్శలు చేశారు.